దేవీ నవరాత్రి వేడుకలను జరుపుకోవడానికి యావత్ భారత దేశం రెడీ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి భక్తులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారి స్వరూపాలైన నవ దుర్గలను ప్రతిష్టించి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు ఎలా పూజించడం ఫలవంతం అవుతుంది? ఉదయం లేదా సాయంత్రం సమయంలో పూజ చేయడం ఎక్కువ ప్రభావంతమో తెలుసుకోండి..
నవరాత్రి అనేది దైవిక భక్తి, క్రమశిక్షణ, స్త్రీ శక్తిని పూజిస్తూ జరుపుకునే వేడుక. ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల దుర్గాదేవిని పూర్తి విశ్వాసంతో పూజిస్తారు. అయితే ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని పూజించడం ఉదయం లేదా సాయంత్రం మంచిదా అనే సందేహం చాలా మందికి ఉంది. అయితే ఈ రెండూ పవిత్ర సమయాలే.. అయితే ఏ సమయంలో పూజ చేయాలనేది.. ఎంపిక, సాంప్రదాయ పద్ధతులు, వ్యక్తిగత అలవాటు, పూజ విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపధ్యంలో నవరాత్రి సమయంలో ఉదయం పూజ మంచిదా..! సాయంత్రం మంచిదా తెలుసుకుందాం!
ఉదయం పూజ శక్తి
ఉదయం సమయం సాత్వికమైనది. అంటే, స్వచ్ఛమైనది. ప్రశాంతమైనది. ఆధ్యాత్మికంగా ఉత్తేజకరమైనదని నమ్ముతారు. సూర్యోదయం లేదా బ్రహ్మ ముహర్తం సమయంలో పూజ చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నెయ్యి దీపం వెలిగించడం, మంత్రాలు చదవడం , ఉదయం తాజా పువ్వులు సమర్పించడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఆధ్యాత్మికంగా ఉదయం పూజ శరీరం, మనస్సు రెండింటినీ మేల్కొలపడాన్ని సూచిస్తుంది. రోజంతా మిమ్మల్ని కాపాడటానికి దేవుని కృపను ఆహ్వానించే మార్గం. ఉదయం స్వచ్ఛత, స్పష్టతను సూచిస్తుంది. కనుక ఈ సమయంలో చేసే ప్రార్థన శాంతి, శ్రేయస్సు, రక్షణ ఇస్తుందని నమ్ముతారు. నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండాలనుకునేవారు తమ రోజుని పూజతో ప్రారంభిస్తే ఉపవాసం భక్తితో కొనసాగించడానికి సంకల్పం, స్వీయ-క్రమశిక్షణ కూడా బలపడుతుంది.
సాయంత్రం పూజ ప్రాముఖ్యత
సాయంత్రం పూజ ప్రభావంటంగా ఉంటుంది. చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం పూజలు స్థిరంగా ఉంటాయి. అయితే సాయంత్రం పూజ చేస్తూ వెలిగించే దీపాలు. హారతితో ఆ ఇంటికి దివ్యమైన ప్రకాశాన్ని ఇస్తుంది. కుటుంబాన్ని ఉద్ధరిస్తుంది. సాయంత్రం వాతావరణం రాజసిక స్వభావం కలిగి ఉంటుంది. ఉల్లాసంగా ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం అనేది రోజుని సంతోషంగా గడిపినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి.. రాత్రంతా రక్షణ కోరడానికి ఒక మార్గం.
నవరాత్రిలో సాయంత్రం పూజ చాలా సంప్రదాయాలలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దుర్గాదేవి అంధకారాన్ని, ప్రతికూలతను తొలగించేదిగా పిలువబడుతుంది. సాయంత్రం పూజలో భజనలు పాడతారు, కుటుంబంలోని ప్రతి ఒక్కరితో హారతి ఇస్తారు. ప్రసాదం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. కుటుంబ సభ్యులతో పాటు భక్తులకు ఈ ప్రసాదాన్ని అందిస్తారు.
ఉదయం, సాయంత్రం రెండూ వాటి సొంత ప్రాముఖ్యత ఉన్నవి. అయినప్పటికీ చాలా మంది భక్తులు రోజులో రెండుసార్లు పూజ చేయడాన్ని ఇష్టపడతారు. ఉదయం పూజను మంత్రాలు, పువ్వులు, దీపాలతో చేస్తే.. సాయంత్రం పూజలో హారతి, భజనలు, ఆహార నైవేద్యాలు ఉంటాయి. ఈ సమతుల్యత భక్తులు నవరాత్రి రోజును పవిత్రంగా ప్రారంభించి కృతజ్ఞతతో ముగించేలా చేస్తుంది.
ప్రతి ఒక్కరిలో నవరాత్రి పండుగ స్ఫూర్తి
పూజ సమయంలో ఏదీ దాగి ఉండదు.. నవరాత్రి పండుగ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే దుర్గమ్మను హృదయపూర్వకంగా ప్రార్థించాలి. నవరాత్రులలో ఏదోక సమయంలో మాత్రమే పూజ చేయడనికి వీలు అయితే అప్పుడే ప్రశాంతంగా పూజని చేయండి. ప్రశాంతంగా, ఏకాగ్రతతో , పరధ్యానం లేకుండా నిర్మలమైన హృదయంతో అమ్మవారిని పూజించండి.
ఉదయం పూజ రోజులో శుద్ధి , దిశను వర్ణిస్తుంది. సాయంత్రం పూజ కృతజ్ఞత, చీకటి నుంచి రక్షణను ఇస్తుంది. అందుకనే నవరాత్రులలో చేసే పూజ భక్తులు జీవన విధానం, సంప్రదాయం ప్రకారం చేయాలి. అన్నిటికంటే అమ్మవారి పట్ల అత్యంత భక్తిశ్రద్దలను కలిగి ఉండాలి.
