చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. బైరప్పకొట్టాలో భార్యను అతికిరాతకంగా నరికాడో భర్త. రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన రాజేష్‌తో కీర్తనకు వివాహం జరిగింది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది
చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. బైరప్పకొట్టాలో భార్యను అతికిరాతకంగా నరికాడో భర్త. రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన రాజేష్‌తో కీర్తనకు వివాహం జరిగింది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది కీర్తన. అయితే పుట్టింట్లోనే కీర్తనపై కత్తితో దాడిచేశాడు భర్త రాజేష్. కీర్తన కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. అనంతరం ఇంటి పైనుంచి దూకి బలన్మరణానికి ప్రయత్నించాడు రాజేష్. రాజేష్‌ను పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు. కీర్తన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం పిఎస్ ఆస్పత్రికి తరలించారు.
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





