ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ రాజకీయ పార్టీ నాయకుడు మోసానికి దిగిన ఘటన హుస్నాబాద్ లో చోటుచేసుకుంది. పందిల్ల గ్రామానికి చెందిన బాధితురాలు తన సమస్య చెప్పుకోడానికి సీపీఐ పార్టీకి చెందిన గడిపే మల్లేష్ ను ఆశ్రయించింది
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ రాజకీయ పార్టీ నాయకుడు మోసానికి దిగిన ఘటన హుస్నాబాద్ లో చోటుచేసుకుంది. పందిల్ల గ్రామానికి చెందిన బాధితురాలు తన సమస్య చెప్పుకోడానికి సీపీఐ పార్టీకి చెందిన గడిపే మల్లేష్ ను ఆశ్రయించింది. అయితే తన సమస్య తీర్చకుండా పోగా, ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మల్లేష్ నమ్మబలికాడు. అందుకు రూ. 50 వేలు ఖర్చు అవుతుందని చెప్పి బాధితురాలి వద్ద నుండి ముందస్తుగా రూ. 15 వేలు తీసుకున్నాడు మల్లేష్. అనంతరం ఉద్యోగం గురించి అడిగితే ఏదోక సాకు చెబుతూ తప్పించుకుంటున్నాడు. కనీసం బాధితురాలి ఫోన్ కూడా లిప్ట్ చేయడం లేదు. పైగా ఆమె డబ్బును కూడా తిరిగి ఇవ్వడం లేదు. దాదాపుగా నాలుగు సంవత్సరాలనుండి ఇలాగే చేస్తుండటంతో బాధితురాలు చివరకు హుస్నాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బాధితురాలు కుటుంబ కలహాలతో భర్తకు దూరమై తల్లిదండ్రులకు భారంగా ఉండలేక ఉపాధి కోసం వెతుక్కుంటుంటే తన అవసరాన్ని ఆసరాగా చేసుకుని గడిపె మల్లేష్ నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడన్నారు. యాభై వేలు అడగగా బాధితురాలు రూ 15 వేలు ఇచ్చిందని, అయితే డబ్బులు తీసుకున్న కొద్ది రోజులు పని ఐపోతుందని నమ్మబలికి, ఏడాది నుండి అసలు ఫోన్ స్పందించక పోగా కనిపిస్తే చూసిచూడనట్లు వెల్లిపోతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపిందన్నారు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





