SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: రూ.200 కోట్లు.. కరెంటాఫీసులో కరప్షన్ కింగ్..! ఏసీబీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్‌ రికార్డ్‌..



ఏసీబీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. సర్కారీ కొలువులో ఉంటూనే ప్రైవేట్ కంపెనీ! కెమికల్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల లిస్టులో పేరు.. కరెంట్ కనెక్షన్‌ కావాలంటే పైసలు ఇచ్చుకోవాల్సిందే.. హైరైజ్ బిల్డింగులే అంబేద్కర్‌ టార్గెట్లు.. ఇలా..విద్యుత్‌శాఖ ADE అంబేద్కర్ రూ.200 కోట్లు సంపాదించాడు.. ఏసీబీ ఎంటరివ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది.

వీడు మామూలోడు కాదు, మాయలోడు. పేరు అంబేద్కర్, వృత్తి ప్రభుత్వ కొలువు, సైడ్ ప్రొఫెషన్ మాత్రం లంచం మింగడం.. విద్యుత్‌శాఖ ADE అంబేద్కర్ అవినీతి లీలలు అన్నీ ఇన్నీ కావు.. ఎన్నో.. ఎన్నెన్నో.. నిన్న 11 ప్రాంతాల్లో సోదాలు చేసి అంబేద్కర్‌ను అరెస్టు చేసింది ఏసీబీ. అతడే ఇవాళ న్యూస్‌పేపర్లలో హెడ్‌లైన్ వార్తయ్యాడు. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఈ అవినీతి చక్రవర్తి అక్రమాస్తులు 200 కోట్లకు పైమాటే. శేర్లింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఐదు ఫ్లోర్ల బిల్డింగ్, 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ, 6 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు.. అంబేద్కర్ అక్రమాస్తుల చిట్టా చాలా పెద్దదే ఉంది.

ఇవాళ రిలీజ్ చేసిన రిమాండ్ రిపోర్టులో అంబేద్కర్ అంతులేని అవినీతి చరిత్రను బైటపెట్టింది ఏసీబీ. గతంలో జిహెచ్ఎంసీలో ఏఈగా చేశారు. డిస్కమ్‌లో, పటాన్‌చెరు, కెపిహెచ్‌బీ, గచ్చిబౌలిలో కూడా పనిచేశారు. ఎక్కడ చార్జ్ తీసుకున్న ప్రతీసారీ రీచార్జ్ అయ్యేవాడు. డ్యూటీ ఎక్కితే చాలు పైసావసూలే. మిస్టర్ అంబేద్కర్… కింగ్‌ ఆఫ్ కరప్షన్ ఎలా అయ్యాడో క్లియర్‌గా చెబుతోంది అతడి రిమాండ్ రిపోర్ట్.

>> బినామీ సతీష్ ఇంట్లో రూ. 2.58 కోట్లు సీజ్ చేశారు. ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బు దొరకటం ఏసీబీ చరిత్రలోనే ఫస్ట్‌టైమ్‌.


>> ప్రభుత్వ అధికారిగా ఉంటూనే కెమికల్ ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎదిగారంటే అంబేద్కర్ చేతివాటం ఎంతో అర్థం చేసుకోవచ్చు.

>> సూర్యాపేటలో అంతార్ కెమికల్స్ పేరుతో రెండేళ్ల కిందట ప్రారంభించిన కంపెనీలో ఈ పెద్దమనిషి డైరెక్టర్‌గా ఉన్నారు.

>> తాను పక్కనే ఉండి బినామీలతోనే పనులు కానిస్తూ, అక్రమంగా సంపాదించిన పైసల్ని పదింతలు చేసుకునేవాడు. బినామీలకు కాంట్రాక్టు పనులు ఇప్పించినట్టు కూడా అభియోగాలున్నాయి.

>> ఐటీ కారిడార్‌లో హైరైజ్ బిల్డింగులు ఎక్కువ. వాటికి విద్యుత్ కనెక్షన్లు కావాలంటే సారువారి చేయి తడపందే పనయ్యేది కాదు.

>> కనెక్షన్ ఇచ్చేందుకు లోడ్ సరిపోదని సాకు చెబుతూ వారి వద్ద నుండి కోట్లలో లంచం తీసుకున్నట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో తేల్చారు. వట్టినాగులపల్లిలో వివాదాస్పద వెంచర్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించినా ఖాతరు చేయలేదని ఫిర్యాదులున్నాయి.

ప్రభుత్వ అధికారిగా ఉంటూ ప్రైవేట్ కంపెనీలు పెట్టడం, ఊరూరా బినామీల్ని ఏర్పాటు చేసుకుని, వాళ్ల ద్వారా కథ నడిపించడం.. ఇలా రెచ్చిపోయిన అంబేద్కర్ సారు.. అసలు కంటే కొసరుకే ప్రయారిటీలిచ్చి, వందలకోట్లకు పడగలెత్తాడు. ఆ కథ కాస్తా అడ్డం తిరిగి, ఏసీబీకి చిక్కి ఇప్పుడు ఊచలు లెక్క బెడుతున్నాడు. ఏసీబీ కోర్టులో అంబేద్కర్ ను ప్రవేశపెట్టగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా.. దర్యాప్తులో మున్ముందు మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Also read

Related posts

Share this