SGSTV NEWS
Andhra PradeshCrime

Matrimony Scam: పాపం.. ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లాడిన రాజమండ్రి కుర్రోడు! 20 రోజుల తర్వాత సీన్‌ సితార్‌



అందమైన అమ్మాయిల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొంటున్నారు.. కొన్ని మ్యారేజ్ బ్యూరో ల నిర్వాహకులు. వారికి కొంత డబ్బు ఇచ్చి పెళ్ళిలు చేసుకొని మోసాలు చేసేలా కొంత మంది అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నారు. వారు ఆర్థిక పరిస్థితి బాగాలేక కొందరు విలాస జీవితంకు అలవాటుపడి మరికొందరు అమ్మాయిలు పవిత్ర వివాహ బంధాన్ని ఎదురు కట్నం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి సంఘటన కర్నూలు జిల్లా హొలగుంద మండలం ముద్దట మాగి గ్రామంలో చోటు చేసుకుంది..


రాజమండ్రి, సెప్టెంబర్‌ 16: సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని వీడియో లింక్‌లు చూసాడు.. ముద్ధట మాగి గ్రామంనికి చెందిన కార్తీక్ అనే యువకుడు. తనకు పెళ్లి కాలేదు. పెళ్లి కూతురు కావాలని రాజమండ్రికి చెందిన ఓ మ్యారేజ్ బ్యూరోను ఫోన్ ద్వారా సంప్రదించాడు. ఆ మ్యారేజ్ బ్యూరో వారు కొన్ని రోజుల తర్వాత నీతో పెళ్ళికి ఓ అమ్మాయి ముందుకు వచ్చిందని నమ్మించారు. వీడియో కాల్స్ ద్వారా ఆ అమ్మాయితో మాట్లాడించారు. అంతే.. ముద్దట మాగి యువకుడు పూర్తిగా ఆ అమ్మాయి మోజులో పడ్డాడు.

కోమటి వాళ్ళ ఇళ్లలో (ఆర్య వైశ్యులు) అమ్మాయిల కొరత. నిన్ను పెళ్లి చేసుకుంటా. 4 లక్షలు కావాలి. అయితే మా మ్యారేజ్ బ్యూరోలో కొన్ని నిభందనలు ఉంటాయి. నేను ఎవరో. నీవు ఎవరో నాకు తెలియదు. కేవలం మ్యారేజ్ బ్యూరో ద్వారా మనం ఇద్దరికి పరిచయం. నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే పెళ్ళికి ముందు 4లక్షల రూపాయల డబ్బులు మా మ్యారేజ్ బ్యూరో వారికి చెల్లించాలి అని ఆ అమ్మాయి ఆ కార్తీక్తో ఫోన్‌లో చెప్పింది. ఆ యువకుడు కూడా కోమటి కులస్థులు కావడంతో తన పెళ్ళికి అమ్మాయిలు దొరకరని ఆ అమ్మాయికి ఎదురు కట్నం కింద 4 లక్షల రూపాయలు చెల్లించాడు.

డబ్బు చెల్లింపు తర్వాత పెళ్లి..
యువతి కోరినట్లుగానే ముద్దటమాగి యువకుడు ఆ మ్యారేజ్ బ్యూరో వారికి 4 లక్షల రూపాయల నగదు చెల్లింపు చేశాడు. వారు పెళ్లికి ఒక తేదీని కూడా ఖరారు చేసారు. మంత్రాలయంలో పెళ్ళి వేడుక కూడా ముగిసింది. ఇద్దరు కలిసి 20 రోజులు సంసార జీవితం గడిపారు. ఆ తర్వాత ఉన్నట్టుండి రాజమండ్రికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళింది. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మూడు రోజుల తర్వాత సెల్ ఫోన్ కూడా పని చేయలేదు. దీంతో కార్తీక్‌కి అనుమానం కలిగింది. ఆ అమ్మాయి సెల్ ఫోన్ నెంబర్‌తో పాటు అమెతో వచ్చిన ఇద్దరి సెల్ ఫోన్ నంబర్లు అందుబాటులో లేనట్లు గమనించాడు. వెంటనే కార్తీక్ హోలగుంద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సెల్ ఫోన్ నంబర్లను సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఛేదించారు. రాజమండ్రికి వెళ్ళి వారిని హోలగుంధకు తీసుకొని వచ్చి చిటింగ్ కేసు నమోదు చేశారు. డబ్బు కోసం మోసం పేరుతో పవిత్ర వివాహ బంధాన్ని ఇలా వాడుకోవడం మంచిది కాదని పోలీసులు ఆ అమ్మాయినీ, ఆమె తరుపున స్టేషనుకు తీసుకొచ్చిన ఇద్దరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి చీటింగ్ కేసు నమోదు చేసి పంపారు. అయితే కేసు నమోదులో పోలీసులు కొంత మొత్తం తీసుకొన్నట్లు ఆరోపణ వచ్చాయి.

Also read

Related posts

Share this