SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: నగరంలో దారుణం..వెండి నగల కోసం.. వృద్ధుడి గొంతు పిసికి..


అక్రమ మార్గంలో ధనం సంపాదించడానికి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒంటిపై ఉన్న  వెండి నగల కోసం ఓ వృద్ధుడిని హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది.

Crime News : అక్రమ మార్గంలో ధనం సంపాదించడానికి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒంటిపై ఉన్న  వెండి నగల కోసం ఓ వృద్ధుడిని హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. మృతుడి కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌ విష్ణునగర్‌ బస్తీలో సేవ్యానాయక్‌ (70), భార్య సుశీల నివాసముంటున్నారు. సేవ్యానాయక్‌ ఈ వయసులోనూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే సమయంలో వారు అద్దెకుంటున్న ఇంటికి సమీపంలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు.  దీంతో ఆయన రాత్రి పూట ప్రతిరోజు అక్కడే పడుకుంటున్నాడు.  రోజులాగే ఆదివారం రాత్రి  కూడా ఒంటరిగా నిద్రించాడు. అయితే  తెల్లవారుజామున  నిద్ర లేచే సమయం మించి పోయినప్పటికీ ఆయన నిద్ర నుంచి లేవకపోవడంతో స్థానికులు అనుమానంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు

వెంటనే అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు సేవ్యానాయక్‌ వయసు మీద పడటంతో తొలుత సహజ మరణంగా భావించారు.  అయితే మృతున్ని గమనించాక ఆయన చేతులకు కాళ్లకు  ఉండాల్సిన వెండి కడియాలు, వెండి మొలతాడు కనిపించకపోవడంతో అనుమానాలకు తావిచ్చింది. దీంతో మృతున్ని గమనించగా మెడ నులిమినట్లు గాయాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌, డాగ్‌ స్క్వాడ్‌లు రప్పించారు.  ఆధారాల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, రోజు ఆయన అక్కడ పడుకుంటుండగా గమనించిన వారే ఆయనను హత్య చేసి వెండి నగలు దొంగిలించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.  అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న సైదాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this