SGSTV NEWS
Spiritual

పాండవులు, రాముడితో ముడిపడిన ఈ చెరువు.. శ్రాద్ధ కర్మలకు ప్రసిద్ది.. పూర్వీకులకు మోక్షం.. ఎక్కడుందంటే

 

మన దేశంలో అనేక ప్రాముఖ్య పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్ర స్థలాలు ఉన్నాయి. ఒకొక్క స్థలం ఒకొక్క విశిష్టతని కలిగి ఉంటుంది. అదే విధంగా మన దేశంలో పితృ పక్ష సమయంలో ఒక తీర్ధయాత్ర స్థలంలో శ్రాద్ధ కర్మలను నిర్వహించడం. తర్పణం విడవడం.. పూర్వీకుల ఆత్మలకు శాంతిని ఇస్తుందని, వారు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. ఈ ప్రదేశం శతాబ్దాలుగా సంచరిస్తున్న ఆత్మలకు మోక్షానికి మార్గదర్శకంగా పరిగణించబడుతుంది. ఇక్కడే పాండవులు తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలను నిర్వహించినట్లు స్థల పురాణం.. ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఉన్న హత్య హరణ తీర్థం, పితృ పక్ష సమయంలో ప్రపంచానికి , మరణానంతర జీవితానికి మధ్య దూరాన్ని తొలగిస్తుంది. ఈ పవిత్ర స్థలం పూర్వీకులను ఋణం నుంచి విముక్తి, చేయడమే కాదు సంచరించే ఆత్మలకు శాంతిని, మోక్షాన్ని అందించే తీర్ధ యాత్రా స్థలంగా యుగయుగాల కాలం నుంచి ప్రసిద్ధి చెందింది. రామాయణం, మహాభారత కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు ఈ ప్రదేశాన్ని మరింత ముఖ్యమైనవిగా చేశాయి.

భూమి మధ్యలో ఉన్న పవిత్ర స్థలం ఈ పుణ్యక్షేత్రం హర్దోయ్ జిల్లాలోని బెనిగంజ్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశం భూమి మధ్యలో ఉందని చెబుతారు. పితృ పక్ష సమయంలో ఈ ప్రదేశం ప్రపంచానికి , మరణానంతర జీవితానికి మధ్య దూరాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. ఇక్కడ చేసే నిర్వహించే శ్రాద్ధ కర్మలు, ప్రార్థనలు నేరుగా పూర్వీకులకు చేరుతాయని నమ్మకం. అందుకే పితృ పక్ష సమయంలో ఈ తీర్ధయాత్రా స్థలంలో భారీ రద్దీ నెలకొంటుంది.

సంచరిస్తున్న ఆత్మలకు శాంతి , మోక్షం ఇచ్చే ప్రదేశం హర్దోయ్ లోని బెనిగంజ్ ప్రాంతంలో ఉన్న హత్యహరన్ తీర్థం ప్రాముఖ్యత రామాయణం, మహాభారత కాలం నాటిది. వేదాల ప్రకారం ఈ ప్రదేశం ఒకప్పుడు శివుడు తపస్సు చేసిన ప్రదేశం. శివ పురాణం ప్రకారం పార్వతి దేవి దాహం తీర్చడానికి.. శివుడు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తూ.. ఆ నీటి ద్వారా ఒక చెరువును సృష్టించాడు. అప్పుడు పార్వతి దేవి ఈ చెరువులోని నీటిని తాగింది.

మహాభారత యుద్ధం తర్వాత పాండవులు యుద్ధంలో మరణించిన తమ కుటుంబ సభ్యులకు ఇక్కడే తర్పణం ఆచరించారు. ఈ ప్రదేశంలో శ్రద్ధా తర్పణం చేయడం వల్ల అసంతృప్త ఆత్మలకు శాంతి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు బ్రహ్మహత్యా పాపం నుంచి బయటపడటానికి శ్రీరాముడు కూడా ఈ కుండంలో స్నానమాచరించాడని నమ్మకం. ఆ తర్వాత ఈ ప్రదేశం మోక్షాన్ని అందించే తీర్థయాత్రగా ప్రసిద్ధి చెందింది.

నైమిశారణ్యంతో ముడిపడి ఉన్న ప్రాముఖ్యత ఈ తీర్థయాత్ర స్థలం 88 వేల మంది ఋషుల తపస్సు స్థలం అయిన నైమిశారణ్యానికి సమీపంలో ఉంది. ఇది దీని ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. వేదాలు , పురాణాలలో నైమిశారణ్యాన్ని తపస్సు , జ్ఞాన కేంద్రంగా పరిగణిస్తారు. అందువల్ల హత్య హరణ తీర్థం ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యత రెండూ చాలా లోతైనవి.

పితృ పక్షంలో విశేష ప్రాముఖ్యత పితృ పక్ష సమయంలో దేశ విదేశాల నుంచి భక్తులు తమ పూర్వీకులకు తర్పణం, శ్రద్ధా కర్మలను చేయడానికి ఇక్కడకు వస్తారు. ఇక్కడ చేసే దానధర్మాలు , స్నానం పూర్వీకుల ఆశీస్సులను ప్రసాదిస్తుందని నమ్ముతారు. పితృ పక్ష సమయంలో ఇక్కడి వాతావరణం ఉత్సవంలా మారుతుందని స్థానిక రచయిత పునీత్ మిశ్రా చెప్పారు. చెరువు చుట్టూ ఉన్న పురాతన చెట్లు , రాళ్ళు ఇప్పటికీ ఈ ప్రదేశం ప్రాచీనత, దైవత్వానికి నిదర్శనంగా ఉన్నాయి

Related posts

Share this