SGSTV NEWS
CrimeTelangana

Crime News : థూ..ఏం కొడుకువురా…మద్యం మత్తులో కన్న తల్లినే చెరపట్టే యత్నం


తల్లి అంటే దైవంతో సమానం..అలాంటి తల్లిపై సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ కసాయి కొడుకు. కన్నతల్లి అనే కనీస సోయి లేకుండా మద్యం మత్తులో తల్లినే చెరపట్టే ప్రయత్నం చేశాడు. ఆ మృగం నుంచి తన భార్యను కాపాడుకునే క్రమంలో  తండ్రిచేతిలో కుక్కచావు చచ్చాడు.

Crime News : తల్లి అంటే దైవంతో సమానం..అలాంటి తల్లిపై సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ కసాయి కొడుకు. కన్నతల్లి అనే కనీస సోయి లేకుండా మద్యం మత్తులో తల్లినే చెరపట్టే ప్రయత్నం చేశాడు. ఆ మృగం నుంచి తన భార్యను కాపాడుకునే క్రమంలో  తండ్రిచేతిలో కుక్కచావు చచ్చాడు. తల్లులంతా తల్లడిల్లే ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని . పోలేపల్లి గ్రామం డీటీసీ (జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం) సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సష్టించింది.

సీఐ కమలాకర్‌ కథనం ప్రకారం.. పోలేపల్లి గ్రామానికి చెందిన దంపతులు జడ్చర్ల డీటీసీ సమీపంలో నివసిస్తున్నారు. వీరు రోజు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా నలుగురిలో చిన్న కుమారుడు శ్రీధర్‌కు మినహా అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. తల్లిదండ్రుల వద్దే ఉంటున్న శ్రీధర్‌ (28) జులాయిగా తిరుగుతూ కొన్ని రోజులుగా తాగుడుకు బానిసయ్యాడు. ఎలాంటి పనిచేయకపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో  జల్సాల కోసంతల్లిదండ్రులను హింసిస్తున్నాడు.

తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ సంపాదించిన డబ్బును బలవంతంగా తీసుకుని తాగడానికి ఖర్చు చేస్తున్నాడు. తాగిన మత్తులో అనేకసార్లు  కన్నతల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కుమారుడి వేధింపులు భరించలేక విషయాన్ని ఆమె చాలాసార్లు భర్తకు చెప్పకుని కుమిలిపోయింది. దీంతో ఆయన అనేకమార్లు కొడుకును మందలించాడు. తన ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా శ్రీధర్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి మద్యం సేవించిన శ్రీధర్‌ మధ్యరాత్రి సమయంలో తల్లి దండ్రులు పడుకున్న తర్వాత తల్లి దగ్గరకు వచ్చి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.

ఆమె అతని నుంచి తప్పించుకుని ఇంటి బయటకు పరుగెత్తే ప్రయత్నం చేసిందిజ అయినా వదలని శ్రీధర్‌ చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసి అరిచింది. ఆ అరుపులకు పక్క గదిలో నిద్రిస్తున్న భర్త మేల్కొని.. భార్యను కాపాడే ప్రయత్నం చేశాడు. అయినా వదలని శ్రీధర్‌ ఆగ్రహంతో తండ్రిని నెట్టి వేశాడు.  అతను కింద పడిపోయాడు. ఈ క్రమంలో తండ్రి తన భార్యను కాపాడుకునేందుకు పక్కనే ఉన్న కర్రతో కుమారుడి తలపై బాదడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. అలా పడిపోయిన శ్రీధర్‌లో చలనం లేకపోవడంతో తమ కుమారుడు మృతి చెందాడని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Also read

Related posts

Share this