హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో దారుణం వెలుగు చూసింది. అల్లారు ముద్దుగా పెంచాల్సిన కొడుకును అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ కసాయి తండ్రి. రెండున్నరేళ్ల కొడుకును చంపి మూసీలో పడేశాడు ఓ తండ్రి. కొడుకుకు అనారోగ్య సమస్యలు ఉండడమే కారణమని తెలుస్తోంది. కుటుంబసభ్యులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో దారుణం వెలుగు చూసింది. అల్లారు ముద్దుగా పెంచాల్సిన కొడుకును అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ కసాయి తండ్రి. రెండున్నరేళ్ల కొడుకును చంపి మూసీలో పడేశాడు ఓ తండ్రి. కొడుకుకు అనారోగ్య సమస్యలు ఉండడమే కారణమని తెలుస్తోంది. కుటుంబసభ్యులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులకు నిందితుడు చెప్పిన సమాచారం మేరకు.. మూసీలో హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి కొన్నాళ్లుగా నీలోఫర్‌లో చికిత్స చేయిస్తున్నారు. పండ్ల వ్యాపారి అయిన తండ్రి.. ఈ నెల 12న మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లి వచ్చాడు. ఏం జరిగిందో అదే రోజు తెల్లవారుజామున బాలుడ్ని గొంతునులిమి చంపి.. నయాపూల్ బ్రిడ్జిపై నుంచి మూసీలో విసిరేశాడు. బాలుడు లేడని వెతికిన బంధువులు.. పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. తండ్రి తమదైన స్టైల్‌లో ప్రశ్నిస్తే.. నిజం ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు