Andhra Pradesh: పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు బూర్లె నాగరాజు, కోరాడ చిన్నప్పడు ఇటుకల తయారీకి కావలసిన ఊక కోసం లారీతో మిల్లు వద్దకు వెళ్లారు..
Andhra Pradesh: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. రైస్ మిల్లు వద్ద కాపలా కాస్తున్న నైట్ వాచ్ మెన్ ను దారుణంగా కొట్టి చంపారు. అసలు అర్థరాత్రి నైట్ వాచ్‌మెన్ ను కిరాతకంగా ఎందుకు హతమార్చారు? నైట్ వాచ్‌మెన్ ను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజాం మున్సిపాలిటీ పరిధిలోని పొనుగుటివలసకి చెందిన ముత్యాలనాయుడు, డోలపేట సమీపంలో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ లో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
గత నెల 14న రాత్రి ఇంటి నుండి డ్యూటీకి వెళ్లిన ముత్యాలనాయుడు తెల్లవారిన తరువాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు మిల్లు వద్దకు వెళ్లి చూశారు. అలా వెళ్లిన వారికి ఆందోళన కలిగించే ఘటన ఎదురైంది. ముత్యాలనాయుడు తీవ్ర గాయాలతో మంచం పై పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. జరిగిన ఘటన పై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు బూర్లె నాగరాజు, కోరాడ చిన్నప్పడు ఇటుకల తయారీకి కావలసిన ఊక కోసం లారీతో మిల్లు వద్దకు వెళ్లారు. అక్కడ కార్మికులు ఊక లోడు చేస్తుండగా ఇద్దరు డ్రైవర్లు మిల్లు ప్రాంగణంలోనే మద్యం సేవించేందుకు ప్రయత్నించారు. అది గమనించిన ముత్యాలనాయుడు వారిని ఆపేందుకు ప్రయత్నించాడు.
అలా డ్రైవర్లకు, నైట్ వాచ్‌మెన్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత కోపంతో ఆ ఇద్దరు డ్రైవర్లు ముత్యాల నాయుడు పై దాడి చేసి, తీవ్రంగా కొట్టి మంచంపై పడవేసి వెళ్లిపోయారు. దాడి తర్వాత గాయాలతో బాధపడుతూ ముత్యాలనాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. కేసు దర్యాప్తులో పోలీసులకు అసలు విషయాలు బయట పడ్డాయి. మద్యం మత్తులో బూర్లె నాగరాజు, కోరాడ చిన్నప్పడు నైట్ వాచ్‌మెన్ ను కిరాతకంగా దాడిచేసి గాయపరిచారని తేల్చారు.
అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రాజాం కోర్టులో హాజరుపరిచారు. ముత్యాల నాయుడు మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న ముత్యాలనాయుడు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కేవలం పనిలో నిబద్ధత చూపినందుకే ఆయన ప్రాణాలు పోయాయని వాపోతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని మృతుడి భార్య కన్నీళ్లు మున్నీరుగా విలపిస్తుంది. గ్రామస్థులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వాగ్వాదమే ఇలా హత్యకు దారి తీస్తే ప్రజల ప్రాణాలకు భద్రత ఎక్కడుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలనాయుడు కుటుంబానికి న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు