ఆపరేషన్ థియేటర్‌లో ఓ డాక్టర్ చేసిన పాడుపని చర్చనీయాంశంగా మారింది. రోగిని మధ్యలో వదిలేసి నర్సుతో రొమాన్స్‌లో మునిగిపోయాడు సదరు డాక్టర్. చాలా సేపటి తర్వాత వచ్చి అతడు ఆ రోగికి ఆపరేషన్ చేశాడు. ఆ డాక్టర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
డాక్టర్ దేవుళ్లతో సమానం అని అంటారు. ప్రాణాలు నిలపగల శక్తి ఒక డాక్టర్‌కు మాత్రమే ఉంటుంది. అటువంటి డాక్టర్ ఆ వృత్తికే మచ్చ తెచ్చే పనిచేశాడు. ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న రోగిని పట్టించుకోకుకండా మరో థియేటర్‌లో నర్సుతో రొమాన్స్‌లో మునిగిపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన గతేడాది సెప్టెంబర్ 16న బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లోని టేమ్‌సైడ్ హాస్పిటల్‌లో జరిగింది. 44 ఏళ్ల కన్సల్టెంట్ అనస్థీషియా నిపుణుడైన డాక్టర్ సుహైల్ అంజుమ్.. ఒక రోగికి పిత్తాశయ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఆ రోగికి అనస్థీషియా ఇచ్చి అతడు బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఆయన మరో ఆపరేటింగ్ థియేటర్‌లో ఒక నర్సుతో లైంగిక చర్యలో పాల్గొన్నారని విచారణలో తేలింది. ఈ దారుణాన్ని నర్స్ ఎన్‌టీ అనే సహోద్యోగి ఉన్నతాధికారులకు నివేదించారు.
డాక్టర్ అంజుమ్ సుమారు ఎనిమిది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి శస్త్రచికిత్సను పూర్తి చేశారు. అయితే అదృష్టవశాత్తు రోగికి ఎటువంటి హాని జరగలేదని తెలిపారు. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు డాక్టర్ అంజుమ్ పశ్చాతాపం వ్యక్తం చేశారు. పూర్తి బాధ్యత తనదేనని మెడికల్ ట్రిబ్యునల్‌కు తెలిపారు. ‘‘ఇది చాలా సిగ్గుచేటు. నన్ను నేను మాత్రమే నిందించుకోవాలి. నేను నా రోగిని, సహోద్యోగులను, వైద్య వృత్తిపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశాను’’ అని ఆయన అన్నారు. తాను తన సహోద్యోగుల గౌరవాన్ని కోల్పోయానంటూ బాధపడ్డారు. అయితే తన చర్యలకు వ్యక్తిగత సమస్యలే కారణమని డాక్టర్ అంజుమ్ వివరణ ఇచ్చారు. భార్యాభర్తల మధ్య పెరిగిన ఒత్తిడి కారణంగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు.
భవిష్యత్తుపై ఆశ
ది ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం.. డాక్టర్ అంజుమ్ ఇప్పటికే టేమ్‌సైడ్ హాస్పిటల్‌ను విడిచిపెట్టి.. తన స్వదేశమైన పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లారు. అయితే భవిష్యత్తులో తిరిగి యూకేలో తన వైద్య వృత్తిని కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ సంఘటన తన జీవితంలో ఒకసారి జరిగిన తప్పు అని, మళ్లీ జరగదని ప్యానెల్‌కు హామీ ఇచ్చారు. ఈ తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం కావాలి అని ఆయన ట్రిబ్యునల్‌ను వేడుకున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు