గుంటూరులో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం ఏకంగా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గుంటూరు గవురుపాలెంకు చెందిన కిరణ్ తేజ. రేపల్లె పెనుమూడికి చెందిన వసంత మధ్య ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
గుంటూరులో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం ఏకంగా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గుంటూరు గవురుపాలెంకు చెందిన కిరణ్ తేజ. రేపల్లె పెనుమూడికి చెందిన వసంత మధ్య ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇటీవల చేబ్రోలు నుంచి పొన్నూరు వచ్చి సహజీవనం చేస్తున్నారు ఈ ప్రేమ జంట. అయితే వసంతకు ఇటీవల రాజు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకుని రాజుతో గొడవకు దిగాడు కిరణ్ తేజ. మరోవైపు కిరణ్ తేజను బెదిరించారు వసంత కుటుంబ సభ్యులు.
ప్రాణాపాయ స్థితిలో
అయితే రెండు రోజుల క్రితం స్థానిక రైల్వే ట్రాక్‌పై రెండు చేతులు, కాలు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు కిరణ్ తేజ. వెంటనే అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కిరణ్ తేజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నాడు కిరణ్ తేజ. అయితే రాజు, వసంత కుటుంబ సభ్యులే దాడి చేశారని కిరణ్ తేజ ఫ్యామిలీ భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు