SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: దడ పుట్టిస్తున్న కూకట్‌పల్లి మర్డర్‌.. మహిళను కాళ్లుచేతులు కట్టేసి మరీ..

 

హైదారాబాద్‌ కూకట్‌పల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాళ్లు చేతులు కట్టేసి కుక్కర్‌తో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఒక మహిళను కాళ్లు చేతులు కట్టేసి కుక్కర్‌తో తలపై కొట్టి అతి దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వెలుటు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిట్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాన్ లేక్ అనే గేటేడ్ కమ్యూనిటీ లో ఘటన చోటు చేసుకుంది.


అయితే స్వాన్ లేక్ అనే గేటేడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్‌ అనే మహిళ నివసిస్తుంది. అయితే 11 రోజుల క్రితం వీళ్ల ఇంట్లో పనిచేసేందుకు ఇద్దరు యువకులు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సమయంలో కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో రేణు అగర్వాల్‌ మృతదేహం కనిపించట్టు తెలపారు. ప్రెజర్‌ కుక్కర్‌ మూతతో ఆమె తలపై బలంగా కొట్టి, కత్తులతో గొంతు కోసం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ తర్వాత బట్టలకు రక్తం మరకలు అంటడంతో ఆ దుస్తులను అక్కడే వదలేసి ఇంట్లో స్నానం చేసి వేరే దుస్తులు వేసుకొని.. ఇంట్లో ఉన్న బంగారం డబ్బు సైతం దోచుకొని వారు అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share this