బల్లి ఏం చేస్తుందిలే అని జాలిపడి ఇంట్లోని కీటకాలను తెరిచి ఊరికే వదిలేస్తుంటారు ఇంకొందరు. బల్లిని చూడటం శుభమని కొందరు భావిస్తారు. అశుభమని మరికొందరు అంటారు. జ్యోతిశాస్త్రం ప్రకారం బల్లి డబ్బు విషయాలలో శుభప్రదంగా పరిగణించబడుతుందని మీకు తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే…
ఇంట్లో బొద్దింకలు, బీటిల్స్, కందిరీగలు, బల్లులు ఉండటం చాలా సాధారణం. కొందరికి ఇంట్లో బల్లులు ఉండటం ఇష్టం ఉండదు. అలాంటివారు వాటిని తరమకుండా ఉండలేరు. బల్లి ఏం చేస్తుందిలే అని జాలిపడి ఇంట్లోని కీటకాలను తెరిచి ఊరికే వదిలేస్తుంటారు ఇంకొందరు. బల్లిని చూడటం శుభమని కొందరు భావిస్తారు. అశుభమని మరికొందరు అంటారు. జ్యోతిశాస్త్రం ప్రకారం బల్లి డబ్బు విషయాలలో శుభప్రదంగా పరిగణించబడుతుందని మీకు తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే…
ఇంట్లోకి బల్లి రావడం, తరచూ కొన్ని ప్రదేశాలలో అది కనిపించడం, బల్లి మీద పడటం వంటివి కొన్ని ప్రత్యేక సంకేతాలను అందిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రంలో బల్లి కనిపిస్తే కలిగే శుభ, అశుభ సంకేతాలను గురించి వివరించారు. కొత్త ఇంటి వాస్తు పూజను వెండి బల్లి విగ్రహాలను ఉపయోగించి నిర్వహిస్తారు. బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంచుతుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంటి పూజ గదిలో బల్లులు కనిపిస్తే చాలా శుభ శకునంగా భావిస్తారు. సమీప భవిష్యత్తులో మీరు మరింత డబ్బును పొందబోతున్నారని ఇది సూచిస్తుంది.
దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఆ సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే, ఇంట్లో రెండు బల్లులు కలిసి కనిపిస్తే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి శుభం, అశుభం అనే సంబంధం లేదని అంటున్నారు. కానీ, రెండు బల్లులు పరస్పరం పోట్లాడుకుంటూ కనిపిస్తే మాత్రం అది అశుభానికి సంకేతం అంటున్నారు. కుటుంబంలో అనారోగ్యం, గొడవలు రాబోతున్నాయని సూచిస్తుందని చెబుతున్నారు. బల్లి నేలపై పాకుతూ కనిపించటం కూడా శుభ సూచికంగానే భావించాలని చెబుతున్నారు. కానీ, వాటికి హాని చేయకూడదని సూచిస్తున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు