హిందువులు శారదీయ నవరాత్రి ఉత్సవాలను దేశమంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గాదేవిని శక్తికి, జ్ఞానానికి ప్రతీకగా కొలుస్తారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. దుర్గాదేవి దైవిక స్త్రీ శక్తికి ప్రతిరూపం, దీనిని శక్తి అని కూడా పిలుస్తారు. నవరాత్రి పండుగ సందర్భంగా దుర్గాదేవిని తొమ్మిది శక్తివంతమైన రూపాల్లో పూజిస్తారు. తొమ్మిది రోజుల్లో పూజించే అమ్మవారిని నవ-దుర్గ అని పిలుస్తారు.
నవరాత్రి తొమ్మిది రోజులు దుర్గాదేవిని భక్తిప్రపత్తులతో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ఒకొక్క అవతారాన్ని పూజిస్తారు. అమ్మవారికి ఒకొక్క రంగు వస్త్రాలు, నైవేద్యాలను సమర్పిస్తారు. అమ్మవారిని నవ దుర్గలుగా రెండు సాంప్రదాయాల ప్రకారం పూజిస్తారు. మొదటి సాంప్రదాయం పురాణోక్తం, రెండవ సాంప్రదాయం శాస్త్రోక్తం. వీటిని గురించి దేవి మహాత్మ్యం, దేవి కవచంలో వివరించబడ్డాయి. ప్రతి రూపానికి దాని సొంత ప్రత్యేకమైన కథ, ప్రతీకవాదం, ప్రాముఖ్యత ఉన్నాయి. 2025 లో దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22 న ప్రారంభమై అక్టోబర్ 2 న విజయదశమితో ముగుస్తాయి. నవరాత్రి సమయంలో పూజించే దుర్గాదేవి రూపాల్లో ఒక స్త్రీ జననం నుంచి మోక్షం వరకు జీవితంలోని వివిధ దశలు కనిపిస్తాయి.

మొదటి రోజు శైలపుత్రి మాత: శైలపుత్రి మాత.. “పర్వత కుమార్తె” అని అర్థం. హిమ పుత్రిక అని నమ్మకం. ‘శైల’ అంటే పర్వతం, ‘పుత్రి’ అంటే కూతురు. పర్వత దేవుని కుమార్తెగా జననం. శివుడి భార్య పార్వతి అవతారంగా భావిస్తారు. ఆమెను పూజించడం వల్ల బలం, భక్తి వస్తుంది

రెండవ రోజు బ్రహ్మచారిణి మాత: రెండవ రోజు భక్తులు తపస్సు, క్రమశిక్షణకు దేవత అయిన బ్రహ్మచారిణిని పూజిస్తారు. శివుడితో ఐక్యం కావడానికి ధ్యానం చేసిందని విశ్వాసం. జపమాల, నీటి కుండతో చెప్పులు లేకుండా నడుస్తున్న దుర్గాదేవి రూపం. ఆమె భక్తులకు జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక వృద్ధిని ఇస్తుంది.

మూడవ రోజు చంద్రఘంట మాత: మూడవ రోజు చంద్రఘంట మాతకు అంకితం చేయబడింది. ఆమె నుదిటిపై చంద్రవంకతో ఉంటుంది. ఆమెను పాపాలను నాశనం చేసేది. దుష్టశక్తుల నుంచి రక్షిస్తుందని నమ్మకం. చంద్రఘంట అమ్మవారు పులిపై స్వారీ చేస్తుంది. పది చేతులు కలిగి ఉంటుంది. ఆమె కుడి చేతుల్లో, ఆమె కమలం, బాణం, విల్లు, జపమాలను కలిగి ఉంటుంది, ఒక చేతిలో అభయ ముద్ర ఉంటుంది. ఆమె ఎడమ చేతుల్లో త్రిశూలం, గద, కత్తి, కమండలం ధరించి ఉంటుంది. ఒక చేతితో వరద ముద్ర ఉంటుంది. ఆమెను పూజించడం వలన భయం, బాధ తొలగి ధైర్యం, శాంతి లభిస్తుంది.

నాలుగవ రోజు కూష్మాండ మాత: నాల్గవ రోజు, కూష్మాండ మాతను పూజిస్తారు. ఆమెను విశ్వ సృష్టికర్త.. ఆది శక్తి అని కూడా పిలుస్తారు. ఆమె ప్రకాశవంతమైన చిరునవ్వు ప్రపంచానికి జీవితాన్ని, శక్తిని ఇస్తుందని నమ్ముతారు. భక్తులు ఆరోగ్యం, సంపద, ఆనందం కోసం ఆమెను ప్రార్థిస్తారు.

ఐదవ రోజు స్కందమాత మాత: కార్తికేయ (స్కంద) తల్లి అయిన స్కందమాతను ఐదవ రోజున పూజిస్తారు. ఆమె సింహంపై కూర్చుని తన కొడుకును ఎత్తుకున్నట్లు దర్శనం ఇస్తుంది. దుర్గాదేవి ఈ రూపం మాతృత్వం, ప్రేమ, రక్షణను సూచిస్తుంది. ఆమెను పూజించడం వలన శ్రేయస్సు, కుటుంబ సామరస్యం కలుగుతుంది.

ఆరవ రోజు కాత్యాయని మాత: ఆరవ రోజున భక్తులు యోధ దేవత అయిన కాత్యాయణి దేవిని పూజిస్తారు. పురాణాల ప్రకారం కాత్యాయన ముని చేసిన తపస్సుని మెచ్చి అతని కుమార్తెగా జన్మించింది. ఆమె శక్తి, ధైర్యం, చెడుపై విజయాన్ని సూచిస్తుంది. ఆమె మహిళలను దీర్ఘ సుమంగళిగా ఉండేలా ఆశీర్వదిస్తుందని నమ్ముతారు.

ఏడవ రోజు కాళరాత్రి: దుర్గాదేవి ఏడవ రూపం కాళరాత్రి, అత్యంత ఉగ్ర అవతారం. ఆమె నల్లటి రంగు, నిర్భయ రూపంతో రాక్షసులను, దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఆమెను పూజించడం వల్ల భయం తొలగి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.

ఎనిమిదవ రోజు మహాగౌరి: ఎనిమిదవ రోజున, భక్తులు స్వచ్ఛత, శాంతి, కరుణను సూచించే మహాగౌరిని పూజిస్తారు. తెల్లని దుస్తులు ధరించి, త్రిశూలం, డ్రమ్ పట్టుకుని తెల్లటి ఎద్దుపై స్వారీ చేస్తుంది. సంసారం చివరిదశ వస్తుందనగా జీవితాన్ని వెనక్కి చూసుకుని అన్నింటినీ వదిలేసి శుద్ద స్వరూపంగా ఉండగలగడం.. ఆమె ప్రశాంతతను ప్రసరింపజేస్తుంది. తన భక్తులకు ఆరోగ్యం, శ్రేయస్సు ని ఇస్తుంది.

తొమ్మిదవ రోజు రోజు సిద్ధిదాత్రి: తొమ్మిదవ రోజు దుర్గాదేవి అవతారం సిద్ధిదాత్రిని పూజిస్తారు. ఈ అవతారం లక్ష్యం దైవచింతనతో సిద్ది పొందడం. అతీంద్రియ శక్తులను కలిగి ఉంది. శివుడు కూడా సిద్ధిదాత్రిని పూజించడం ద్వారా తన శక్తులను పొందాడని నమ్ముతారు. భక్తులు జ్ఞానం, కోరికల నెరవేర్చమంటూ అమ్మవారి ఆశీర్వాదాలను కోరుకుంటారు.