సెప్టెంబర్ 2025 నెలలో రెండు ఖగోళ సంఘటనలు చంద్రగ్రహణం, సూర్య గ్రహణం ఏర్పదనున్నయై. భాద్రప్రద మాసం పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడగా.. 15 రోజుల తర్వాత సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరం పితృ పక్షం గ్రహణంతో ప్రారంభమై గ్రహనంతో ముగుస్తుంది. ఈ సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం పితృ పక్ష సమయంలో ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో సూతక కాలానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.
ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం 2025 సెప్టెంబర్ 21న సంభవిస్తుంది. ఈ సూర్య గ్రహణం పితృ పక్షంలో చివరి రోజున అంటే భాద్రప్రద మాసం అమావాస్య రోజున ఏర్పడనుంది. ఇది భారతదేశంలో కనిపించకపోయినా న్యూజిలాండ్, ఫిజి, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాలలో కనిపిస్తుంది.
సూర్య గ్రహణ 2025 తేదీ, సమయం భాద్రప్రద మాసం కృష్ణ పక్ష అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ 21, 2025న రాత్రి 11:00 గంటలకు ISTకి సూర్యగ్రహణం ప్రారంభమై అర్థరాత్రి 3:23 AM న ముగుస్తుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో కన్యా రాశిలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యారాశిలో ఉంటారు. శనీశ్వరుడు మీన రాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటారు. కుజుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, బృహస్పతి మకరరాశిలో, శుక్రుడు, కేతువు కలిసి సింహరాశిలో ఉంటారు.
సూర్య గ్రహణం జ్యోతిష ప్రభావం ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం కన్య రాశి , ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో గ్రహాల కలయిక వ్యక్తిగత కుండలిలోని ఏర్పడే దానిని బట్టి.. వ్యక్తుల జీవితమలో సవాళ్లు, అవకాశాలను రెండింటినీ తెస్తాయని చెబుతారు.
సూర్య గ్రహణం 2025 , పితృ పక్షం ఈ సూర్యగ్రహణం పితృ పక్ష ముగింపు రోజున ఏర్పడనున్నది. దీంతో ఈ గ్రహణం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. నమ్మకాల ప్రకారం ఈ కాలంలో గ్రహణాలను విశ్వంలో మార్పు, ప్రతిబింబం శక్తివంతమైన గుర్తులుగా భావిస్తారు. గ్రహణం ఏర్పడినప్పుడు.. విడిచినప్పుడు పాటించే సంప్రదాయాలు.. ఆధ్యాత్మిక ప్రక్షాళనకు అవకాశంగా కూడా పరిగణించబడుతున్నాయి. గ్రహణం గడిచిన తర్వాత కొత్త ప్రారంభాలకు మార్గం సుగమం చేస్తుంది.
