శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జ్ వినుత కోట బెయిల్ పై విడుదలైంది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడును కిరాతకంగా చంపించి చెన్నైలోని ఓ నదిలో పడవేసిన కేసులో వినుత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు బెయిల్ మంజూరైంది.
Crime : శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జ్ వినుత కోట బెయిల్ పై విడుదలైంది.తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడు(22)ను కిరాతకంగా చంపించి చెన్నైలోని ఓ నదిలో పడవేసిన కేసులో వినుత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు బెయిల్ మంజూరైంది. రాయుడు హత్య కేసులో ఏ3 గా ఉన్న ఆమెకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది, అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటలు లోపు C3 సెవెన్ వెల్స్ చెన్నై పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈకేసులో విచారణ పూర్తయ్యేవరకు పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే…
శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇచ్‌చార్జ్‌గా ఉన్న కోట వినుత వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు(22) చెన్నైలో హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో వినుతతో పాటు ఆమె భర్త మరో ముగ్గురు కలిసి అతన్ని హత్య చేసినట్లు తేలింది. దీంతో వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో చిన్నతనం నుంచే అమ్మమ్మ వద్ద పెరిగాడు. ఆ తర్వాత జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ వినుత వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా.. డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. చిన్నప్పటి నుంచి నమ్మినబంటుగా మెలిగాడు. ఏమైందో ఏమోగానీ ఇటీవల అతనిపై అనుమానం పెంచుకున్నారు. విధుల నుంచి సైతం తొలగించేశారు. తొలగించిన సమయంలో శ్రీనివాసులు తమకు ద్రోహం చేసిన కారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కోట వినూత వెల్లడించారు. ఇకపై అతనికి, తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇక్కడి వరకు భాగానే ఉన్న ఆ తర్వాత అతను హత్యకు గురయ్యాడు. చెన్నై సమీపంలో అతని మృతదేశం లభించడం సంచలనంగా మారింది. చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. పోలీసులు అరా తీయగా అతనిది హత్య అని తేలింది.
వ్యక్తిగత రహస్యాలు, పార్టీ కార్యకలాపాలు బయటపెడుతున్నాడన్న కక్షతో వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌తో పాటు మరో ముగ్గురు కలిసి రాయుడుని అతికిరాతకంగా చంపేశారు. మృతదేహాన్ని చెన్నైకి తీసుకెళ్లి ఓ నదిలో పడేసి చేతులు దులుపుకోవాలని చూశారు. అయితే అక్కడి పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, మరో ముగ్గురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. కాగా ఈ హత్య కేసులో ఎ3గా ఉన్న వినుతకు బెయిల్ మంజూరైంది. కాగా ఇప్పటికే వినుతను జనసేన నుంచి బహిష్కరిస్తు్న్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025