ఎవరైనా రోడ్డుపై నిలబడి ఉండగా సడన్‌గా ఒక కారు వచ్చి వాళ్లను అందులోకి బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్లడం మనం సినిమాల్లో చాలా చూసుంటాం. అయితే ఇచ్చం అలాంటి ఘటనే తాజాగా అల్లూరు జిల్లా దేవీపట్నం వెలుగుచూసింది. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య అనే యువతిని కొందరు గుర్తు తెలియని సినీ పక్కిలో ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
సచివాలయంలోకి చొరబడి కొందరు దుండగులు గొంతుపై కత్తిపెట్టి సినీ ఫక్కీలో మహిళా ఉద్యోగిని ఎత్తుకెళ్లిన ఘటన అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీ పరిధిలో వెలుగు చూసింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సౌమ్య అనే యువతిని కొందరు గుర్తు తెలియని దుండగులు సినీ పక్కిలో ఎత్తుకెళ్లారు. సచివాలయంలో సిబ్బంది ఉండగానే లోపలికి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు సౌమ్య గొంతుపై కత్తి పెట్టి అక్కడున్న వారందరినీ బెదిరించి ఆమెను కొట్టుకుంటూ బయటకు ఈడ్చుకెల్లారు.
పక్కనే ఉన్న వైస్ సర్పంచ్ వెంకన్న దొర దుండగులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. వారు అతన్ని కూడా కత్తితో బెదిరింపులకు బెదిరించి తప్పించుకున్నారు. బయటకు వెళ్లి AP 31 TJ 1462 నెంబర్ గల ఇన్నోవా కారులో అక్కడి నుంచి నేలకోట అటవీ ప్రాంతం వైపుగా పారిపోయారు. అయితే దుండగులను గుర్తించిన ఒక మహిళా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించి పోలీసు అధికారులను అలెర్ట్ చేసింది.
సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా సీసీకెమెరాలను పరిశీలించారు. ఘటనపై స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కిడ్నాప్ సమయంలో సచివాలయ సిబ్బంది దుండగుల నిలదీసే ప్రయత్నం చేశాగా. యువతి తమకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని.. ఎవరైనా కావాలని అతి చేస్తే ఇబ్బందులకు గురవుతారని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు.
అయితే కిడ్నాప్‌కు వచ్చిన క్రమంలో దుండగులు తమ ముఖాలను గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్కులు వేసుకుని సచివాలయంలోకి ప్రవేశించింనట్టు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఇప్పటికే రంపచోడవరం సర్కిల్ డిఎస్పి స్థానిక పోలీసులను అలెర్ట్ చేసి నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు
Also read
- నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్‌పై దారుణం!





