SGSTV NEWS
Spiritual

Shukra Gochar: జన్మాష్టమి తర్వాత లక్ష్మీ నారాయణ రాజయోగం.. సంపద, విజయం ఈ ఐదు రాశుల సొంతం



నవ గ్రహాల్లో శుక్రుడు ఒక గ్రహం. అత్యంత ప్రకాశ వంతమైన గ్రహాల్లో ఒకటి. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, శృంగారం, ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. అంతేకాదు శుక్రుడు సంపద, శ్రేయస్సు గ్రహంగా భావిస్తారు. అటువంటి శుక్రుడు జన్మాష్టమి తర్వాత సంచారం చేయనున్నాడు. ఈ సంచారం బుధుడు, శుక్రుని సంయోగం జరగనుంది. దీంతో లక్ష్మీ నారాయణ రాజ్యయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో ఐదు రాశులకు చెందిన వ్యక్తులకు సంపద, విషయం, ఆనందం తెస్తుంది.

శుక్రుడు ఆగస్టు 21, 2025న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారంతో వేద జ్యోతిషశాస్త్రంలో ‘లక్ష్మీ నారాయణ రాజయోగం’ అని పిలువబడే అత్యంత శుభ యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో శుక్రుడు, బుధుడు ఇద్దరూ కర్కాటక రాశిలో కలిసి ఉంటారు. ఇది ఈ యోగ ప్రభావాన్ని మరింత పెంచుతుంది. బుధుడు ఆగస్టు 11న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత ఆగస్టు 21న శుక్రుడు ఈ రాశిలోకి అడుగు పెడతాడు. అనంతరం ఈ శుభ యోగం చురుగ్గా ఉంటుంది. యాదృచ్చికం ఏమిటంటే.. జన్మాష్టమి తర్వాత ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో 5 రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆర్థిక పురోగతి, కుటుంబంలో ఆనందం, కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు ఆ ఐదు రాశులు ఏమిటో తెలుసుకోండి..

మేషరాశి: శుక్ర సంచారము మేష రాశిలో నాల్గవ ఇంట్లో ఉంటుంది. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఇల్లు, వాహనం, సౌకర్యాలకు సంబంధించిన విషయాలలో పురోగతి ఉంటుంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. సమాజంలో వీరి ఖ్యాతి పెరుగుతుంది. బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారాస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశి మొదటి ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. ఈ సమయంలో వీరి విశ్వాసం, ఆకర్షణ పెరుగుతుంది. కళ, సంగీతం, రచన , సృజనాత్మక రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. చదువుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. వివాహానికి మంచి ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది.


కన్య రాశి: శుక్ర సంచారము కన్య రాశి లాభదాయక గృహమైన 11వ గృహంలో జరుగుతుంది. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు వీరు కొన్ని గొప్ప శుభ వార్తని వినే అవకాశం ఉంది. చేతి వృత్తులకు చెందిన వారు ఆ రంగంలో పురోగతి ఉంటుంది. పాత స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. తండ్రి మద్దతు కూడా వీరికి లభిస్తుంది.

వృశ్చిక రాశి: శుక్ర సంచారము ఈ రాశి జన్మ కుండలిలో తొమ్మిదవ ఇంట్లో ఉంటుంది. దీని కారణంగా అదృష్టం వీరి వైపు ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి. వృత్తిపరమైన ప్రయాణం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారికి మద్దతు, ప్రశంసలు లభిస్తాయి.

మకర రాశి: ఈ సంచారము మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఏడవ ఇంట్లో ఉంటుంది. దంపతుల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతాయి. భాగస్వామికి సంబంధించిన అపార్థాలు పరిష్కరించబడతాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. పదోన్నతి అవకాశాలు కలుగవచ్చు.

జన్మాష్టమి తర్వాత ఏర్పడే ఈ లక్ష్మీ నారాయణ రాజ్యయోగం ఈ ఐదు రాశుల వారికి ఆనందాన్ని తెస్తుంది. అది వృత్తి అయినా, కుటుంబ జీవితం అయినా లేదా ఆర్థిక పరిస్థితి అయినా.. ప్రతి రంగంలోనూ సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఇటువంటి యోగాలు మళ్లీ మళ్లీ ఏర్పడవు. కనుక ఈ రాశులకు చెందిన వ్యక్తులు ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి.

Also read

Related posts

Share this