ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకుందామని దుబాయ్ నుంచి వచ్చాడు ఓ యువకుడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పాడు..అయితే వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసుఫ్ నగర్‌కి చెందిన వినయ్ ఐదు రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. వినయ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్లుగా పరస్పరం ప్రేమించుకున్నారు. వినయ్ దుబాయ్‌లో ఉపాధి కోసం వెళ్ళాడు. అయితే శ్రావణమాసంలో పెళ్లి చేసుకోవడానికి స్వగ్రామానికి వచ్చాడు. అయితే ప్రేమ పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అందుకు అతడి కుటుంబం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే మృతి చెందారని డాక్టర్స్ ధృవీకరించారు. యువకుడు ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే వినయ్ ఈ రకంగా ఆత్మహత్య చేసుకుంటారని ఎవరు ఊహించలేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చనిపోతున్నారు. ప్రేమ జంటలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే కొంత సమయం కుటుంబ సభ్యులకు ఇచ్చి పెళ్లికి ఒప్పించాలని.. ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవద్దని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





