ఆలయ అర్చకుడు అంటే భగవంతునికి భక్తునికి మధ్య వారధిలాంటివాడు. తమ కష్టాలు భగవంతునికి చెప్పుకోవాలని ఎంతో విశ్వాసంతో ఆలయానికి వస్తారు. భక్తుల అభీష్టం మేరకు అర్చకుడు వారి పేరుమీద పూజలు నిర్వహిస్తారు. అంతటి పవిత్రమైన క్రతువును ఓ పూజారి భ్రష్టుపట్టించాడు. మద్యం మత్తులో తూగుతూ పూజలు నిర్వహించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
మణుగూరు నీలకంటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడి మద్యం మత్తులో పూజలు చేస్తున్నాడు. మద్యం సేవించి ఆలయంలో పూజలు చేస్తుండటంతో భక్తుల ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈఓ. గర్భగుడిలో హుండీ చాటున మద్యం బాటిళ్లు, గుట్కాలను గుర్తించిన అధికారులు.. ఇవేం గలీజ్ పనులు అంటూ అర్చకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడ్ని వెంటనే విధుల నుంచి తొలగించారు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని కాకతీయుల కాలం నాటి శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు రామచంద్రరావుపై ఎండోమెంట్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఆలయ ఈవో శేషయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో అర్చకుడి బాగోతం బయటపడింది. ఈఓ నిర్వహించిన తనిఖీల్లో గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు బయట పడ్డాయి. నీలకంటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడు రామచంద్రరావు గత కొంతకాలంగా మద్యం సేవిస్తూ స్వామివారికి అభిషేకాలు, పూజలు చేస్తున్నాడు. అంతేకాకుండా గుడిలో మద్యం మత్తులో పడుకుంటుండడంతో కొందరు భక్తులు.. దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు, ఆలయంలో సోదాలు నిర్వహించగా.. గుట్కా ప్యాకెట్లతో పాటు గర్భగుడిలో మద్యం సీసాలు బయటపడ్డాయి. అవి చూసి ఆశ్చర్యపోయిన అధికారులు.. అర్చకుడు రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. పవిత్రమైన ఆలయంలో ఇవేం గలీజ్ పనులు అంటూ నిలదీశారు. అర్చకుడు రామచంద్రరావు చేసే నిర్వాకంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించడమే కాకుండా విధుల నుంచి అతడ్ని తొలగించి మరొకరికి అర్చకత్వ బాధ్యతలు అప్పగించారు. శివాలయంలో అర్చకుడి లీలలు బయటపడడంతో హవ్వా.! ఇవేం పనులు అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు
Also read
- విహారంలో విషాదం.. సముద్ర తీరంలో కొట్టుకుపోయి ముగ్గురు యువతులు, యువకుడు మృతి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- రావణుడి అంత్యక్రియలు ఎవరు నిర్వహించారు? రాముడి ఆదేశంతో ఏం జరిగిందంటే..!?
- Dhantrayodashi 2022 ధన్వంతరి ఎవరు? తనను ధన త్రయోదశి రోజునే ఎందుకు పూజిస్తారో తెలుసా…
- Dhanteras: ధన్తేరస్ నవంబర్ 6 లేదా 7న? పూజా ముహూర్తం, బంగారం కొనుగోలు శుభ సమయాలు ఇవే!





