కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల అటవీ ప్రాంతంలోని శ్మశాన వాటికలో సిట్ తవ్వకాలు జరిపింది. పాయింట్ నంబర్ 1లో తవ్వకాలు జరపగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈసారి పాయింట్ నంబర్ 2లో తవ్వకాలు జరపాలని సిట్ భావిస్తోంది.
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల కేసు ప్రస్తుతం సంచలనం రేపుతుంది. ఈ పుణ్య క్షేత్రంలో సామూహిక హత్యలు, ఖననాలు జరిగాయని ఓ వ్యక్తి ఆరోపణలు చేయడంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిట్ ధర్మస్థల అటవీ ప్రాంతంలో శ్మశాన వాటికల్లో తవ్వకాలు చేపట్టింది. ప్రత్యేక పూజ చేసి సిట్ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. అసలు ఈ సామూహిక మరణాలు జరిగాయా? అసలు జరిగితే ఎందుకు జరిగాయి? అన్న కోణాల్లో సిట్ ఈ తవ్వకాలు చేపట్టింది. అయితే సిట్ మొదటిసారి 13 ప్రాంతాల్లో తవ్వకాల జరిపింది. ఈ ప్రాంతాలు అన్నింట్లో కూడా పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు.
మొదటి తవ్వకాల్లో లభించని ఆధారాలు
సుమారుగా 15 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు వరకు తవ్వగా.. ఎలాంటి అస్థిపంజర అవశేషాలు, ఇతర భౌతిక ఆధారాలు కూడా అధికారులకు లభించలేదు. మొదటిసారి నిర్వహించిన ఈ తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా కూడా సిట్ మళ్లీ తవ్వకాలు జరపాలని భావిస్తోంది. నిజాలు ఏంటనే విషయం తెలిసే వరకు ఈ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయని సిట్ స్పష్టం చేసింది. ఈ తవ్వకాల కోసం మొత్తం 12 మంది స్థానిక కార్మికులను సిట్ నియమించింది. మొదటి కార్మికులతో తవ్వకాలు జరపగా దాని తర్వాత జేసీబీ యంత్రాల సాయంతో జరిపారు. అయితే పాయింట్ నంబర్ 1 వద్ద ఇప్పుడు తవ్వకాలు జరపగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మళ్లీ పాయింట్ నంబర్ 2 వద్ద కూడా తవ్వకాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తవ్వకాలు జరిపేటప్పుడు ప్రతీ దాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు.
వెలుగులోకి ఎలా వచ్చిందంటే?
ఈ ధర్మస్థల వివాదం 2012లో వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో సౌజన్య అనే 17 ఏళ్ల విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేసి చంపేశారు. ఈమె మృతదేహం ధర్మస్థల సమీపంలో దొరికింది. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేయగా.. ఆ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చాడు. నిందితులకు శిక్ష పడలేదని, దోషులను పట్టుకోవాలని సౌజన్య కుటుంబంతో పాటు పలువురు డిమాండ్ చేశారు. అయితే 1995 నుంచి 2014 వరకు ధర్మస్థలలో ఓ పారిశుద్ధ్య కార్మికుడి పనిచేశాడు. ఆ సమయంలో తాను ఎన్నో వందల మృతదేహాలు దహనం లేదా పూడ్చిపెట్టాలని తనని కొందరు బలవంతం చేశారని ఆరోపించాడు. ఇందులో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు ఉండేవని జులై నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మృతదేహాలపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగినట్లు తెలిపాడు. స్కూల్ విద్యార్థినులు, భిక్షగాళ్లు కూడా ఉన్నారట. పాతి పెట్టేటప్పుడు వీరిని రహస్యంగా చేయాలని అతన్ని బెదిరించినట్లు వెల్లడించాడు. నేత్రావది నది ఒడ్డున మొత్తం 15 ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికుడు గుర్తించాడు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు