SGSTV NEWS
Famous Hindu TemplesSpiritual

ఇలాంటి గుడి ఎక్కడా చూసుండరు.. రాహుకాలంలో రాహువుకి పాలు పోస్తే నీలంగా… కిందకు రాగానే తెల్లగా మారే పాలు..



మన దేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఆ సేతు హిమాచలంలో చిన్న పెద్ద అనేక దేవాలయాలున్నాయి. కొన్ని ఆలయాలు అత్యంత పురాతనమైనవి. నేటికీ మానవ మేథస్సు చేధించలేని రహస్యాలను దాచుకున్న ఆలయాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. అలాంటి మిస్టరీ ఆలయంలో ఒకటి శివునికి అంకితం చేయబడిన దేవాలయం. ఈ ఆలయంలో రాహుకి పాలు పోస్తే నీలం రంగులోకి మారతాయి. రాహు దోషం నుంచి విముక్తి పొందడానికి ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
ఇలాంటి గుడి ఎక్కడా చూసుండరు..

తమిళనాడు కుంభకోణంలోని  తిరునాగేశ్వరం ఆలయం ఎన్నో మిస్టరీలు దాచుకున్న ఆలయం. ఈ ఆలయాన్ని రాహు స్థలం అని కూడా అంటారు. ఇది శివుడికి అంకితం చేయబడిన దేవాలయం. ఇది నవ గ్రహ అంశాలతో, నవగ్రహ స్థలాలతో, ముఖ్యంగా రాహువుతో సంబంధం ఉన్న ఆలయాలలో ఒకటి. కనుక ఈ ఆలయం శైవులకు ముఖ్యమైనదిగా పరిగణింపబడుతున్నది. ఇక్కడ శివుడిని నాగనాథర్‌గా, పార్వతి దేవిని పిరైసూడి అమ్మన్ గా పుజిస్తారు. ఈ ఆలయంలో రాహు కాలంలో ఒక అద్భుతం చోటు చేసుకుంటుంది.

ఈ ఆలయంలో రాహుకాలంలో రాహు విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే.. ఆ పాలు నీలం రంగులోకి మారతాయి. ఈ అద్భుతం భక్తులను ఆకర్షిస్తుంది. శివ పూజను నాగేశ్వరన్ ఆలయం, తిరునాగేశ్వరం , తిరుపంపురం అనే మూడు ఆలయాలలో ఉదయం, మధ్యాహ్నం , సాయంత్రం నిర్వహించాలని స్థానిక నమ్మకం.

ఈ ఆలయం నవ గ్రహాల్లో ఒకటి అయిన రాహు గ్రహానికి సంబంధించిన ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జాతకంలో రాహు దోషం, రాహువు సంబధిత ప్రభావాల నుంచి ఉపశమనం కోసం ఈ ఆలయం ప్రసిద్దిగాంచింది. ఇక్కడ కొలువైన నాగనాథర్‌ను 7వ శతాబ్దపు తమిళ శైవ కవి తిరుజ్ఞాన సంబంధర్ పది శ్లోకాలతో పూజించారు. ఇది శైవ నియమావళిలో ప్రస్తావించబడిన 276 దేవాలయాలలో ఒకటి.



తిరునాగేశ్వరం ఆలయానికి ప్రసిద్ధి?
నాగనాథస్వామి ఆలయం అరుదైన దేవాలయాలలో ఒకటి. ఇక్కడ భక్తులు సర్ప దోషం నుంచి ముఖ్యంగా రాహు దోషం నుంచి ఉపశమనం పొందడానికి భారీ సంఖ్యలో వస్తారు. రాహు కాలంలో రాహు దోష నివారణకు పాలతో లింగానికి అభిషేకం చేస్తే అప్పుడు ఆ పాలు నీలం రంగులోకి మారుతాయి. ఇలా జరగడం అంటే ఆ భక్తుడి రాహు దోషాన్ని సూచిస్తుందని నమ్మకం. ఇలా లింగానికి సమర్పించిన పాలు అద్భుతంగా నీలం రంగులోకి మారి నేలపైకి ప్రవహించిన తర్వాత స్వచ్ఛమైన తెల్లగా మారుతాయి. దీంతో రాహు దోషం తొలగినట్లు భక్తులు భావిస్తారు.

తిరునాగేశ్వరం ఆలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది?
తిరునాగేశ్వరం ఆలయం హిందూ జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల్లో ఒకటైన రాహువుతో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం శివ భక్తులు మాత్రమే కాదు రాహు కేతు సంబధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు రాహువు, కేతువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆధ్యాత్మిక వృద్ధి కోసం అత్యధికంగా భక్తులు సందర్శిస్తారు.

ఈ ఆలయంలో ఆచారాల ప్రకారం పూజలు చేయడం, ప్రార్థనలు చేయడం వల్ల రాహు కేతు గ్రహాల దుష్ప్రభావాలను తగ్గించి శాంతి, విజయం లభిస్తుందని భావిస్తారు.

ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం ఎప్పుడు?
ఈ సందర్శించడానికి రాహుకాలం ఉత్తమ సమయం. అంతేకాదు మహా శివరాత్రి, మహా శివరాత్రి, ప్రదోషం వంటి ప్రత్యేక సందర్బాలలో సందర్శించి దోష నివారణకు పాలను సమర్పించడం వలన రాహు, కేతు దోషాల నుంచి ఉపశమనం కలిగి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు. ఆరోగ్యం, సిరి సంపదలు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.

Also read

Related posts

Share this