కోదాడ మున్సిపాలిటీ కోమరబండకు చెందిన మహేశ్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తూ ఇటీవల నిరాకరించడంతో మహిళ మనస్థాపానికి గురైంది. ఇంట్లోకి తీసుకువెళ్లడానికి మహేశ్ నిరాకరించడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది.
suicide attempt : ఏడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కోదాడ మున్సిపాలిటీ కోమరబండకు చెందిన మహేశ్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తూ ఇటీవల యువకుడు నిరాకరించడంతో మహిళ మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలో తన కూతురుతో కలిసి వచ్చి గత రెండు రోజులుగా మహేష్ ఇంటి ముందు ధర్నా చేస్తుంది. ఇంట్లోకి తీసుకువెళ్లడానికి మహేశ్ నిరాకరించడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది.
యువకుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తనను మహేష్ మోసం చేశాడు అంటూ యువకుడి ఇంటి ముందు పెట్రోల్ పోసుకోవడంతో కలకలం రేగింది.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు యువతిని బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేయించిన అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025