SGSTV NEWS
Crime

Nellore Murder : ఇంటికి పిలిచి ప్రియుడిని లేపేసిన ఇల్లాలు.. నెల్లూరులో మరో దారుణం


వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు. ఈ అక్రమ సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకోంది.

వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు. ఈ అక్రమ సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకోంది. ఇంటికి ప్రియుడిని పిలిచి మరీ లేపేసింది ఓ ఇల్లాలు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరుణ్ కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ప్రవళిక సంచలన ఆరోపణలు
అయితే ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్ ఇంటికి పిలిచింది. కానీ అదే ఇంట్లో తరుణ్ తేజ్ హత్యకు గురయ్యాడు. అయితే దీనిపై తరుణ్ తేజ్ భార్య ప్రవళిక సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను మాధవితో పాటుగా మరికొందరు  కలిసి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read

Related posts

Share this