SGSTV NEWS
CrimeTelangana

Telangana: వారాంతపు సంతలో నాన్నతో వెళ్లి పల్లీలు కొనుకున్న బాలుడు – రాత్రి తింటుండగా

 

వారసంతలో కొనుగోలు చేసిన వేరు శనగలు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. నాలుగేళ్ల బాలుడు శనగ గింజ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయిన ఘటన కొమురంభీం జిల్లా కనికి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం.

కొమురంభీం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కౌటాల మండలం కనికి‌ గ్రామంలో వేరు శనగ విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక నాలుగు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. నాలుగేళ్ల రిషి మృతి చెందిన తీరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొమురంభీం జిల్లా కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన రుషి తండ్రితో కలిసి సోమవారం కౌటాల లోని వారసంతకు వెళ్లాడు. వారసంతలో వేయించిన వేరు శనగలను‌ కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చి రాత్రి పడుకునే సమయంలో శనగ కాయలను‌ తింటుండగా ఓ శనగ గింజ గొంతులో‌ ఇరుక్కుపోయింది. శ్వాస ఆడకపోవడంతో ఊపిరాడక అస్వస్థతకు గురయ్యాడు. గుర్తించిన తండ్రి వెంటనే స్థానిక ఆస్పత్రికి‌ తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలో నే బాలుడు మరణించాడు. ఈ ఘటనతో కనికి గ్రామంలో విషాదచాయలు‌ అలుముకున్నాయి. రుషి.. జాడి ప్రకాష్ కళ్యాణి దంపతుల ఏకైక వారసుడు కావడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

Also read

Related posts

Share this