SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఆ అమ్మాయికి, ఆత్మీయ బంధాలకు దూరమయ్యా.. చనిపోయే ముందు విద్యార్థి ఏం చెప్పాడంటే..



ఓ వైపు భవిష్యత్తు.. మరోవైపు ఆత్మీయ ప్రేమ బంధాలకు దూరమయ్యాయనే ఆవేదన.. ప్రేమించిన యువతి మరొకరితో వివాహం చేసుకోవడం.. ఆ యువకుడిని తీవ్ర సంఘర్షణకు గురిచేసింది.. తన అనుకున్న వాళ్లంతా తనకు కాకుండా పోతున్నారని మనో వేదనకు గురయ్యాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు..


ఓ వైపు భవిష్యత్తు.. మరోవైపు ఆత్మీయ ప్రేమ బంధాలకు దూరమయ్యాయనే ఆవేదన.. ప్రేమించిన యువతి మరొకరితో వివాహం చేసుకోవడం.. ఆ యువకుడిని తీవ్ర సంఘర్షణకు గురిచేసింది.. తన అనుకున్న వాళ్లంతా తనకు కాకుండా పోతున్నారని మనో వేదనకు గురయ్యాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు.. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని వోక్సెన్యూనివర్సిటీ (Woxsen University) లో జరిగింది.. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


పూర్తి వివరాల ప్రకారం..
హైదరాబాద్ సరూర్నగర్‌కు చెందిన రుషికేష్(19) వోక్సెన్యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడి తల్లిదండ్రులు ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. వారు విడాకులు తీసుకున్నారు. దీంతో అక్కతో కలిసి రుషికేష్తల్లి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ కలపాలని చాలా ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు..ఈ క్రమంలోనే తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహమైంది. ఈ పరిణామాలు అతడిని మానసికంగా కుంగదీశాయి.

వీటికి తోడు ఇటీవల రుషికేష్తన స్నేహితులతో కలిసి కొండపోచమ్మ సాగర్, తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఇందుకోసం ఒక కారును అద్దెకు తీసుకున్నారు.. వారే స్వయంగా నడుపుకుంటూ వెళ్లారు. వచ్చే క్రమంలో కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. రిపేర్ చేయించేందుకు డబ్బులు ఇవ్వాలని యజమాని ఒత్తిడి చేశాడు. కుటుంబంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో సర్దలేకపోయాడు.. ఇలా ఒకదానికి వెనక అనేక సమస్యలు వచ్చిపడటంతో రుషికేష్తట్టుకోలేకపోయాడు.

ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వినిపించాడు.. ఆ తర్వాత క్యాంపస్‌లోని తన గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this