SGSTV NEWS
Astro TipsSpiritual

Nag Panchami 2025: ఎవరైనా కాల సర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా..! నాగపంచమి రోజున ఈ పరిహారాలు చేయడం ఫలవంతం..



శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివయ్య తో పాటు నాగ దేవతను ప్రత్యేకంగా పూజిస్తారు. శివలింగానికి కొన్ని వస్తువులను సమర్పిస్తారు. ముఖ్యంగా ఎవరైనా కాల సర్ప దోషంతో ఇబ్బంది పడుతుంటే నాగ పంచమి రోజున శివలింగానికి కొన్ని రకాల వస్తువులను సమర్పించడం ద్వారా దోషం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు నాగ పంచమి రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమి తిథి రోజుని నాగ పంచమిగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలోని విశ్వాసం ప్రకారం ఈ రోజున సర్ప దేవతను పూజిస్తే.. ఆ వ్యక్తి మహాదేవుని ఆశీస్సులు పొందుతాడు, కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందుతాడు. నాగ పంచమి రోజున శివలింగంపై కొన్ని వస్తువులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నాగ పంచమి రోజున క్రింద ఇవ్వబడిన వస్తువులను సమర్పించి శివుడిని పూజిస్తే.. కాలసర్ప దోషం నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు .

నాగ పంచమి రోజున శివలింగానికి ఏమి సమర్పించాలంటే

తేనె: శివలింగానికి తేనె నైవేద్యం పెడితే ఆర్థిక లాభం వస్తుంది. నాగపంచమి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేసి నైవేద్యంగా సమర్పిస్తే స్టూడెంట్స్ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు.



పచ్చి పాలు: ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే నాగ పంచమి రోజున శివలింగానికి పచ్చి ఆవు పాలను సమర్పించాలి. ఇలా చేయడం ఉద్యోగస్తులకు ఆఫీసులో విజయాన్ని తెస్తుంది . నాగ పంచమి నాడు బ్రహ్మ ముహూర్తంలో శివలింగానికి పాలు సమర్పించాలి .

ధాతుర(ఉమ్మెత్త): ధాతుర పువ్వుతో లేదా కాయతో శివుడిని పూజ చేస్తే.. శివుడు ప్రసన్నం అవుతాడని నమ్మకం. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నాగ పంచమి రోజున శివలింగానికి ధాతురను సమర్పించడం వలన కోరికలు నెరవేరుతాయి .

బిల్వ పత్రాలు: శివుడి బిల్వ పత్రాల ప్రియుడు. నాగ పంచమి రోజున శివలింగానికి మారేడు దళాలను సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

అక్షతలు- చందనం: నాగ పంచమి రోజున శివలింగానికి అక్షతలు , గంధం , పువ్వులు కూడా సమర్పించవచ్చు . ఈ రోజున శివుడికి గంధంతో త్రిపుండాన్ని (మూడు క్షితిజ సమాంతర రేఖలను) పూయండి . ఇలా చేయడం వలన శివుడి ఆశీర్వాదాలు సదా మీ పై ఉంటాయి.

నల్ల నువ్వులు: నాగ పంచమి రోజున శివలింగాన్ని నీటిలో నల్ల నువ్వులు వేసి అభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుందని నమ్ముతారు .

కాల సర్ప దోషం తొలగిపోవడానికి ఏమి చేయాలి ?

నాగ పంచమి రోజున శివుడిని పూజించి, మహామృత్యుంజయ జపం చేయండి .

నాగ పంచమి నాడు, వెండి లేదా రాగితో చేసిన జంట పాములను పవిత్ర నదిలో విడిచిపెట్టండి.

నాగ పంచమి రోజున రావి చెట్టుకు నీళ్ళు సమర్పించి, ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి.

నాగ పంచమి రోజున పేదలకు నల్ల దుప్పట్లు మొదలైనవి దానం చేయండి.

Related posts

Share this