హిందూ మతం నమ్మకాల ప్రకారం సూర్యుడు, ఛాయాదేవిల తనయుడు శనీశ్వరుడు. శివుడికి గొప్ప భక్తుడు. అందుకనే శనీశ్వరుడి అనుగ్రహం పొందాలన్నా, శని దోషాల నుంచి విముక్తి పొందాలన్నా శివుడిని పూజించడం ఫలవంతం అని నమ్మకం. అయితే శ్రావణ మాసంలోని శనివారం శివుడికి కొన్ని రకాల వస్తువులతో పూజించడం వలన శివుడితో పాటు శనీశ్వరుడు ఆశీర్వాదం కలుగుతుందని నమ్మకం. ఈ రోజు శ్రావణ శనివారం శివయ్యకు సమర్పించాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..
హిందూ మతంలో శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసంగా పరిగణిస్తారు. వ్రతాలు, నోములు లను చేయడమే కాదు శివకేశవులను పూజించడానికి అత్యంత పవిత్రమైన మాసం. సోమవారం శివుడికి అంకితం చేయబడింది. మరోవైపు శనివారం శని దేవుడిని పూజించే రోజు. అయితే శ్రావణ శనివారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణింపబడుతున్నది. మత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుడు శివునికి గొప్ప భక్తుడు. కనుక శ్రవణ శనివారం శివయ్యను పూజించడం వల్ల శని దోషం నుంచి బయటపడతాడు. శనివారం శివుడిని పూజిస్తే ఏలినాటి శని లేదా ధైయ్యా నుంచి కూడా విముక్తి పొందుతాడని చెబుతారు. ఈ రోజు శనివారం శివలింగానికి సమర్పించాల్సిన 4 వస్తువుల గురించి తెలుసుకుందాం.. అవి శనీశ్వరుడుకి మాత్రమే ప్రియమైనవి కాదు.. శివుడు కూడా ఇష్టమైనవి. శనివారం శివలింగానికి ఏమి సమర్పించడం వలన శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం.
శనివారం శివలింగానికి ఏమి సమర్పించాలి?
శ్రావణమాసం శనివారం శివలింగానికి నల్ల నువ్వులు, జమ్మి ఆకులు, నీలి శంఖం పువ్వులు, జిల్లేడు పువ్వులు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు శనివారం శివలింగం దగ్గర ఆవాల నూనె దీపం వెలిగించి నీటిని సమర్పించడం కూడా ఫలప్రదంగా పరిగణించబడుతుంది.
నల్ల నువ్వులు: శనివారం శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. శని దేవుని అనుగ్రహం లభిస్తుంది.
జమ్మి ఆకులు: జమ్మి మొక్క శనిదేవుడికి ప్రియమైనది. కనుక శనివారం శివలింగంపై జమ్మి ఆకులను సమర్పించడం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడు. అలాగే ఏలినాటి శని, శని ధైయ్యం వంటి అశుభ ప్రభావాలు తగ్గుతాయి.
నీలం పువ్వులు: నీలం రంగు పువ్వులు అంటే శంఖు పుష్పాలు, జిల్లేడు పువ్వులు శనీశ్వరుడికి చిహ్నంగా భావిస్తారు. ఇవి శివుడికి కూడా ప్రియమైనవి. శనివారం శివలింగానికి నీలిరంగు పువ్వులను సమర్పించడం వల్ల శని దేవుడి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది.
ఆవనూనె: శ్రావణమాసం శనివారం శివలింగం దగ్గర ఆవనూనె దీపం వెలిగించడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు. శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం శ్రావణ శనివారం శివయ్యకు ఈ వస్తువులను సమర్పించడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది, శని దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. శివలింగానికి ఈ వస్తువులను సమర్పించడం వల్ల ఏలినాటి శని, సహా అనేక అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే శివుడు, శనీశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి.
Also read
- మహిమగల చెంబు ఉందంటూ వైద్యురాలి నుండి రూ.1.50 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
- ఆ తల్లికి ఎంత కష్టమొచ్చింది.. మృతదేహంతో స్మశానంలో జాగారం..!
- Hyderabad: సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నం
- Andhra: చవితి వేళ పాలు పోసేందుకు పుట్ట వద్దకు భక్తులు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?




