తెలంగాణలోని సూర్యాపేటలో భారీ దోపిడి జరిగింది. ఏకంగా ఓ జువెలరీ షాప్ కు కన్నం వేశారు. మాస్టర్ ప్లాన్ వేసి.. మొత్తం జువెలరీని దోచుకున్నారు. పక్కా ప్రణాళికతో జ్యువెలరీ షోరూం వెనుక భాగం గోడకు రంధ్రాలు చేసి షట్టర్ ను ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లతో తిజోరీ ధ్వంసం చేసి దోపిడీ చేశారు. ఒకటి కాదు రెండు కాదు 18 కేజీల బంగారాన్ని దొంగలు దోపిడీ చేశారు.
తెలంగాణలోని సూర్యాపేటలో భారీ దోపిడి జరిగింది. ఏకంగా ఓ జువెలరీ షాప్ కు కన్నం వేశారు. మాస్టర్ ప్లాన్ వేసి.. మొత్తం జువెలరీని దోచుకున్నారు. పక్కా ప్రణాళికతో జ్యువెలరీ షోరూం వెనుక భాగం గోడకు రంధ్రాలు చేసి షట్టర్ ను ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లతో తిజోరీ ధ్వంసం చేసి దోపిడీ చేశారు. ఒకటి కాదు రెండు కాదు 18 కేజీల బంగారాన్ని దొంగలు దోపిడీ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలి అత్యంత రద్దీగా ఉండే ఎంజీ రోడ్డులోని సాయి సంతోషి జ్యూవెల్లర్స్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు. కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని దోపిడీ చేశారు. సుమారు 17 కోట్ల రూపాయల విలువైన 18 కేజీల బంగారం దోచుకెళ్ళారు దొంగలు. పక్కా ప్లాన్ తో ఆధునిక పద్ధతిలో చోరీ చేశారు. రాత్రి సమయంలో షాపు వెనుక భాగంలో ఉన్న గోడకు రంద్రం చేసి, షట్టర్‌ను గ్యాస్ కట్టర్ సహాయంతో మనిషి పట్టేంత కట్ చేసి దోపిడి దొంగలు లోపలికి వెళ్లారు. తిజోరి ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌కు రంధ్రం చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. లోపల ఉన్న భారీ ఐరన్ తిజోరీని సైతం గ్యాస్ కట్టర్ తో తెరిచి వెండి జోలికి వెళ్ళకుండా కేవలం బంగారం మాత్రమే చోరీ చేశారు. చోరీ చేయడానికి ముందు దొంగలు సీసీటీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్ చేశారు.
ఉదయం షాపు తెరిచిన యజమాని తెడ్ల కిషోర్ దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ లతో ఆధారాలు సేకరిస్తున్నారు. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ బంగారం షాపుకు చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. దోపిడీ ఘటన అంతరాష్ట్ర ముఠా పనా లేక ఇంటి దొంగలేవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అర్థరాత్రి చోరీ జరిగినట్లు భావిస్తున్న పోలీసులు, సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. జ్యువెలరీ షోరూంలోని ఫుటేజీని, సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను స్కాన్ చేయడమే కాకుండా, సమీపంలోని వ్యక్తులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు జ్యువెలరీ షోరూమ్ సిబ్బందిని కూడా విచారించారు.. త్వరలో మరిన్ని ఆధారాలు దొరుకుతాయని పోలీసులు పేర్కొన్నారు.
శనివారం షాపు మూసేశామని, ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం షాపు తెరిచి చూడగా షాపు మొత్తం దుమ్ము, స్ట్రాంగ్ రూం గోడకు రంధ్రం పడి ఉందని షాప్ యజమాని కిషోర్ తెలిపారు. లోపలికి వెళ్లి చూడగా దొంగలు ఉన్నదంతా దోచుకెళ్లారనీ పేర్కొన్నారు. దాదాపు రూ.17 కోట్ల విలువైన ఆభరణాల చోరీకి పాల్పడ్డారని కిషోర్ తెలిపారు. సీసీటీవీ సహా అన్నీ ధ్వంసమయ్యాయని చెప్పారు
ఈ దోపిడితో సూర్యాపేటలోని బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇలానే దోపిడి జరిగిందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. బంగారం షాప్ యజమాని ఫిర్యాదు మేరకు దొంగతనం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ విషయం పట్టణంలో సంచలనంగా మారి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రధాన కూడలిలో ఉన్న షాపులో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది.
Also read
- Atmakur Forest Scam: ఆత్మకూరు ఫారెస్ట్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. కోట్లకు కోట్లే గుటకాయ స్వాహా!
- Gandikota Inter Girl: ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!
- సగం ధరకే బంగారం అంటూ ప్రచారం.. ఎగబడి పెట్టుబడి పెట్టిన ప్రజలు.. కట్‌చేస్తే..
- Telangana: వారాంతపు సంతలో నాన్నతో వెళ్లి పల్లీలు కొనుకున్న బాలుడు – రాత్రి తింటుండగా
- మరో దారుణం.. తండ్రితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసిన భార్యామణి!