అశ్వాపురం మండలం మొండికుంటలో మందు బాబు వీరంగం సృష్టించాడు. మద్యం దుకాణంలో అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని పెట్రోల్ బాటిల్‌తో హల్చల్, చేశాడు. షాప్ నిర్వాహకులపై పెట్రోల్ పోస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో అతన్ని పట్టుకున్న షాప్ సిబ్బంది తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. షాప్ నిర్వహకుల ఫిర్యాదుతో అతనిపై పోలీసులు హత్యయత్నం కేసు నమోదు చేయడంతో విషయం చర్చనీయాంశంగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంటలో ఓ మద్యం ప్రియుడు వీరంగం సృష్టించాడు. తాను అడిగిన బ్రాండ్ దుకాణంలో లేదని చెప్పడంతో మందుబాబు ఆగ్రహంతో షాపు ఉన్న వారితో గొడవకు దిగాడు, బెల్ట్ షాపుల్లో విరివిగా దొరికే బ్రాండ్స్ దుకాణంలో ఉండక పోవడం ఏంటని ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా తన బ్రాండే లేదంటారా అనే కోపంతో పూటుగా మద్యం సేవించి పెట్రోల్ బాటిల్‌తో మద్యం దుకాణం వద్దకు వచ్చాడు. నేరుగా దుకాణంలోకి వెళ్లి తనకు కావాల్సిన మందు ఇస్తారా..లేదా పెట్రోపోయాలా అని షాప్ నిర్వాహకులను పెట్రోల్ పోసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన యజమాని అతన్ని పట్టుకొవాలని తన సిబ్బందికి తెలిపాడు. షాప్ సిబ్బంది వెంటనే అతన్ని పట్టుకొని కొట్టారు.
ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న దుర్గారావును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. దుర్గారావు చేసిన వ్యవహారాన్ని పోలీసులకు వివరించారు. అయితే పోలీసులు కూడా ఎక్కడ తగ్గేదిలేదు అన్నట్లుగా వ్యవహరించారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి చేసిన తప్పుకు అతనిపై కేసు పెట్టారు. మాములు పెట్టి కేసు కాకుండా ఏకంగా అతను హత్యాయత్నం చేశాడంటూ కేసు నమోదు చేసి.. దుర్గారావును రిమాండ్‌కు తరలించారు. తప్పతాగి మందు బాబు చేసిన వీరంగానికి అశ్వాపురం పోలీసులు ఏకంగా అతనిపై హత్యాయత్నం కేసు పెట్టడంతో ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
వీడియో చూడండి..
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025