అప్పు అనేది చాలా డేంజర్.. మనుషుల మధ్య వివాదాలకు కారణం అవుతుంది.. ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది.. ప్రాణాలు తీసుకునేలా చేస్తుంది.. అప్పు లేకుండా ఉన్న దగ్గరికి సర్దుకు పోయేవారు ఈరోజుల్లో చాలా తక్కువ.. అలా అప్పులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది.. తాజాగా.. ఓ ప్రభుత్వ టీచర్ కూడా ఇలాగే అప్పులు చేసి చివరికి తన బాధను సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. వివరాల ప్రకారం.. మెదక్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాముని రమేష్ మేడ్చల్‌లోని ఓ లాడ్జిలో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మెదక్ పట్టణానికి చెందిన కామిని రమేష్(52) హవేలీ ఘనపూర్ మండలం సర్దన జిల్లా పరిషత్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రమేష్ స్థానికంగా చాలా అప్పుల చేశాడు. అందులో నష్టం రావడంతో చేసిన అప్పుల తీర్చేందుకు ఇల్లు, ఇతర ఆస్తులు విక్రయించి సెటిల్ చేసుకున్నాడు. రెండేళ్లుగా చేసిన అప్పులు తీరుస్తున్నా ఇంకా కొంత మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది.
కానీ.. తిరిగి తీసుకున్న అప్పులు తీర్చాలని సొంత స్నేహితులు వేధిస్తూ కేసులు వేస్తూ తన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారన్న ఆందోళనతో మేడ్చల్‌లోని ఓ లాడ్జిలో తన చావుకు కారణం అయిన స్నేహితుల పేర్లు చెబుతూ ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసి ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లు తన భార్య పిల్లలను రోడ్డు పాలు కాకుండా చూడాలని వీడియోలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, చైర్మన్, వైస్ చైర్మన్ చంద్ర పాల్, మల్లికార్జున్ గౌడ్, అకిరెడ్డి కృష్ణా రెడ్డిలు కష్ట కాలంలో మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు..
చావుకు ముందు చెప్పిన మాటలు వీడియోలో ఇలా ఉన్నాయి..
‘‘నేను కాముని రమేష్ టీచర్ గా పని చేస్తున్నాను. గతంలో చేసిన అప్పులు తిరిగి ఆస్తులు అమ్మి ఇవ్వడం జరిగింది. కానీ కొంత మంది మిత్రులు మిత్రదేహం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ప్రామిసరి నోటు, చెక్ బౌన్స్ కేసులు పెడుతున్నారు. అనేక ఇబ్బందుల పెడుతున్న వారిలో వట్టం సంగమేశ్, బీమరి రాములు, పబ్బభార్గవ్, పబ్బకిరణ్, మైపాల్ రెడ్డిలు కేసులు పెడుతూ నన్ను నా కుటుంబాన్ని అనేక ఇబ్బందులు చేస్తున్నారు. భార్య, పిల్లలు రోడ్డు మీదకు వచ్చాం. వారి వద్ద ఉన్న చెక్కులతో మానసికంగా వేధించి నా దగ్గరగా ఉన్న స్నేహితులైన అండతో సుంకరి వెంకటేష్, బుర్ల శంకర్, విఠల్ దాస్, వీరు, సత్యనారాయణ వీరందరి సహకారంతో నన్ను చంపే ప్రయత్నం కూడా జరిగింది. నన్ను నా భార్యను రోడ్డు పై తీసుకు వచ్చి మెదక్ లో నే ఉంటున్నా.. కానీ అనేక ఇబ్బందులు పెడుతూ టార్చర్ పెడుతున్నారు.’’ అంటూ రోదించాడు..
అప్పులు తీర్చినా.. ఇంకా డబ్బులు కావాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని.. దీనికి కారణమైన వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించి భార్య పిల్లలను కాపాడాలని కాముని రమేష్ కోరాడు. తాను చేసిన మంచి పనులు గుర్తించి తన కుటుంబాన్ని రక్షించాలని ప్రాథేయపడ్డాడు.. తనకు చాలా మంది అండగా ఉన్నారని.. ను చనిపోయినా తర్వాత నా కుటుంబం పై ఎలాంటి కేసులు పెట్టకుండా రోడ్డు పై పడకుండా చూడండని రోదిస్తూ వీడియోలో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!