వాస్తు ప్రకారం పూజ గది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం. కొన్ని దేవతల విగ్రహాలను పుజాగదిలో ఉంచడం శుభప్రదం. అయితే కొన్ని దేవతలు, దేవుళ్ళకు సంబంధించిన చిత్ర పటాలు పెట్టుకోవడం అశుభకరం. ఈ రోజు ఇంట్లోని పూజ గదిలో ఏ రకమైన దేవుళ్ళ విగ్రహాలు లేదా పటాలను పెట్టుకోకూడదో ఈ రోజు ఈ రోజు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజా స్థలం చాలా ముఖ్యమైనది. చాలా పవిత్రమైనది. పూజా గదిలోని మందిరం పరిశుభ్రతగా ఉండాలి. అంతేకాదు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. పూజ గదిలో దేవుళ్ళు , దేవతల విగ్రహాలను పెట్టే విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో శ్రీ కృష్ణుడు, రాధా రాణి విగ్రహాలను కలిపి ఉంచడం శుభప్రదం. అయితే మరికొన్ని దేవుళ్ల విగ్రహాలను కలిపి ఉంచడం వల్ల అశుభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ఏ దేవతల విగ్రహాలు, ఫోటోలను కలిపి ఉంచకూడదో ఈ రోజు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం విష్ణువు, శివలింగాన్ని కలిపి పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే రెండింటినీ పూజించే పద్ధతి భిన్నంగా ఉంటుంది. కనుక విష్ణువు, శివలింగాన్ని కలిపి ఉంచడం వల్ల శుభ ఫలితాల కంటే ఎక్కువ అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే, పొరపాటున అయినా కూడా పూజ గదిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలను కలిపి ఉంచవద్దు. త్రిమూర్తులున్న ఫోటోని కూడా పెట్టుకోవద్దు.
వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన బంధువుల ఫోటోలు లేదా విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు. అలాగే, కాళికా దేవి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల చిత్రాలను పూజ గదిలో ఉంచవద్దు. ఎందుకంటే ఈ దేవతలందరూ ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరిని ప్రత్యేక తాంత్రిక ఆచారాల ద్వారా పూజిస్తారు. అంతేకాదు ఆగ్రహంతో ఉండే అమ్మవారి విగ్రహం లేదా ఉగ్ర రూపంలో ఉన్న దేవత విగ్రహాన్ని పూజ గదిలో ఉంచకూడదు. సానుకూల శక్తి కోసం విగ్రహాలను సంతోషకరమైన, ఆశీర్వదించిన భంగిమల్లో మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది
