గాజువాకలో అల్లరిమూకల వీరంగం ఘటనలో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి పూట ఇంటి ఎదుట ఘర్షణ పడుతున్న యువకుల్ని మందలించినందుకు ఇంటి యజమానిపై బీరుసీసాలతో దాడి చేసినట్టు గుర్తించారు. బాధ్యులైన 11 మందిపై కేసు నమోదు చేసి పదిమందిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకలోని బీసీసీ రోడ్డులో జీవన్ కుమార్ అనే వ్యక్తం నివాసం ఉంటున్నారు. సోమవారం అర్థరాత్రి సింహగిరికాలనీ, అజీమాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు ఒకచోట చేరి మద్యం సేవించారు. ఆ తర్వాత జీవన్‌కుమార్ ఇంటిముందుకు రాగానే వారిలో వారే మద్యం మత్తులో గొడవపడ్డారు.
తమ ఇంటిముందు జరుగుతున్న గొడవను గమనించిన జీవన కుమార్ ‘ఇక్కడ గొడవ పడకండి. మీ ఇళ్లకు వెళ్లిపోండి సదురు యువకులను సూచించాడు. దీంతో ఆగ్రహించిన అప్పల రాజు, వెంకట రమణ , షేక్ బషీర్, మోహన్ కార్తీక్‌లు ఆయన ఇంటి గేటుపైకి ఎక్కి లోపలకు చొరబడ్డారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. పై ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న జీవన్ కిందకు వచ్చి ప్రశ్నించే సరికి అతని తలపై అప్పలరాజు బీరుసీసాతో దాడి చేశాడు. మరి కొంతమంది సహకరించారు. యువకుల దాడిలో జీవన్‌కుమార్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
దీంతో రాజీవ్‌కుమార్ కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజీవ్ కుమార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక రాజీవ్ కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన మొత్తం 11 మందిలో 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇందులో 8 మందిని.. కోర్టు ఆదేశాలతో జైలుకు, మరో ఇద్దరిని జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో నింతుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025