ఆత్మకూరు (ఎం), భువనగిరి : సినీ ఫక్కీలో భర్తను హత్య చేయించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమె ప్రియుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో నిందితుడు రామలింగస్వామి పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. (Crime News) కేసు వివరాలను డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన స్వామి (38) హత్యకు గురయ్యాడు. భార్య స్వాతి తన ప్రియుడు సాయికుమార్, సోదరుడు మహేశ్తో కలిసి భర్తను చంపించింది. బైక్పై వెళ్తున్న స్వామిని కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. స్వాతి, సాయికుమార్, మహేశ్పై పోలీసులు హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 3 ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025