SGSTV NEWS
Andhra PradeshCrime

Kadapa Girl Murder: ఏపీలో దారుణం.. ముళ్లపొదల్లో బట్టలు లేకుండా బీటెక్ యువతి శవం


కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్‌ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. గొంతు బిగించి హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నరు

Kadapa Girl Murder: ఏపీలోని కడప జిల్లాలో దారుణమైన ఘటన(kadapa crime news) చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట వద్ద 20 ఏళ్ల బీటెక్ విద్యార్థిని మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

ముళ్లపొదల్లో బట్టలు లేకుండా
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరుకు చెందిన 20 ఏళ్ల బీటెక్ విద్యార్థిని జూలై 14 (సోమవారం) ఉదయం స్నేహితులతో కలిసి గండికోటకు వెళుతున్నానని ఇంట్లో చెప్పింది. కానీ ఎంత టైం అయినా తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో గండికోట రిజర్వాయర్ సమీపంలో ముళ్ళ పొదల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.

ఘటనా స్థలంలో బీటెక్ స్టూడెంట్ దుస్తులు లేకుండా కనిపించడంతో అంతా ఖంగుతిన్నారు. ఆమె దుస్తులతోనే గొంతు బిగించి హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో.. జిల్లా ఎస్పీ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారించారు.

ఆమె చివరిసారి ఎవరితో మాట్లాడింది.. ఎక్కడకు వెళ్లింది.. అనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించారు. మృతురాలి తల్లిదండ్రులు లోకేష్‌ అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ముందు లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన జమ్మలమడుగు ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది.

Also read

Related posts

Share this