SGSTV NEWS
Andhra PradeshCrime

Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్‌ భయంతో ఊరంతా ఖాళీ!


పోలీసులు అంటే శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజల జీవితాలకు రక్షణ కల్పిస్తారని చెప్తుంటాం. నేరాలు, విధ్వంసాలు జరగకుండా ప్రజల మాన ప్రాణాలను, ఆస్తులను రక్షిస్తుంటారు. అయితే ఆ ఊరి ప్రజలు చేసిన చిన్న మిస్టేక్‌ ఇపుడు ఊరు ఊరందరిని భయంతో పారిపోయేలా చేసింది

కడప జిల్లా వేంపల్లె మేజర్ పంచాయతీ పరిధిలోని పన్నీరు గ్రామంలో ఒక బాలిక అదృశ్యమైంది. ఈ  ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. బాలిక అదృశ్యం పై ఆందోళనకు దిగిన గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అందులో భాగంగా వేంపల్లె పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి చేశారు. అందులోని పర్నీచర్‌ ద్వంసం చేశారు. దీంతో పోలీసులు సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఆరోపిస్తూ  పోలీసులు 162 మందికి పైగా గ్రామస్థులపై కేసు నమోదు చేశారు.


కేసులు నమోదైనవారిలో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా పట్టుకునే పనిలో పడ్డారు. సుమారు  162 మందిపై కేసులు పెట్టడంతో ఆ గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. నిందితుల కోసం తరచూ ఆ గ్రామానికి సైరన్ తో కూడిన పోలీసు వాహనం వస్తుండడంతో ఆ గ్రామస్థులకు ఇప్పుడు పోలీసుల భయం పట్టుకుంది. అరెస్టుల భయంతో చాలామంది గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోయారు. చిన్న విషయానికి అనవసరంగా ఆవేశపడిన గ్రామస్తులు పోలీస్‌ స్టేషన్‌ పై దాడి చేయడంతో ఇప్పుడు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులు సైతం ఎవరి కర్మకు వారు అనుభవించక తప్పదని తేల్చి చెబుతున్నారు.


Also read

Related posts

Share this