హైదరాబాద్: ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిలింనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఆయన అకాల మరణానికి చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు మంచి సద్గతి లభించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
*సిరిపురపు శ్రీధర్ శర్మ*
రాష్ట్ర అధ్యక్షులు
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
