SGSTV NEWS
Crime

AP crime :  పీఎం కిసాన్‌ యాప్‌ ఫేక్ లింక్ పంపి రూ.10 లక్షలు కొట్టేశారు!


సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. పీఎం కిసాన్‌ యోజన నకిలీ యాప్‌ లింకు పంపి.. రూ.10 లక్షల నగదు కాజేశారు.ఈ  ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన రాజాశెట్టి తిరుపతిలోని ఓ గోల్డ్‌ షోరూమ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు

సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. పీఎం కిసాన్‌ యోజన నకిలీ యాప్‌ లింకు పంపి.. రూ.10 లక్షల నగదు కాజేశారు.ఈ  ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐరాల మండలం కొత్తపల్లికి చెందిన రాజాశెట్టి తిరుపతిలోని ఓ గోల్డ్‌ షోరూమ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఫోన్ లో వాలంటీర్‌ విలేజ్‌ గ్రూప్‌లో పీఎం కిసాన్‌ యోజనకు సంబంధించి జూన్ 30న ఓ లింకు వచ్చింది. దీంతో ఆయన ఈ లింక్  ఓపెన్ చేయగానే ఫోన్‌ హ్యాక్‌ అయింది. ఈనెల 4న ఫోన్‌ను ఆన్‌చేసి పరిశీలించగా ఫోన్‌పే ద్వారా రూ.45 వేలు, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా రూ.10 లక్షల లావాదేవీలు జరిపినట్లుగా వెల్లడైంది. దీంతో బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. 

రూ. 2 వేల నగదు కోసం ఎదురుచూపులు
ప్రధానమంత్రి -కిసాన్ సమ్మాన్ నిధికి 20వ విడత డబ్బులు మాత్రం ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు.  దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు రూ. 2 వేల నగదు కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో ఎప్పుడైనా ఈ డబ్బులను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 20న బీహార్‌లోని మోతిహరి పర్యటనకు వెళ్లనున్నారు.  జూలై 18న 20వ విడతను విడుదల చేయవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు నుంచి సమాచారం తెలుస్తోంది.

పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్న లేకా పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది.    ఈ స్కీమ్‌ ద్వారా లబ్ధి పొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పీఎం కిసాన్ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. 

Also read

Related posts

Share this