SGSTV NEWS
CrimeTelangana

Abortions: ఒక్కో అబార్షన్ కు రూ.50 వేలు.. భువనగిరిలో దారుణ దందా.. అడ్డంగా దొరికిన డాక్టర్!


యాదాద్రి జిల్లాలో అబార్షన్ల వ్యవహారం కలకలం రేపుతోంది.  భువనగరిలోని గాయత్రి ఆసుపత్రి అబార్షన్లకు అడ్డగా మారిందన్న ఆరోపణలున్నాయి.  విషయం బయటకు రావడంతో  గాయత్రి ఆసుపత్రిపై సోమవారం తెల్లవారుజూమున SOT పోలీసులు దాడులు చేశారు.

యాదాద్రి జిల్లాలో అబార్షన్ల వ్యవహారం కలకలం రేపుతోంది.  భువనగరిలోని గాయత్రి ఆసుపత్రి అబార్షన్లకు అడ్డగా మారిందన్న ఆరోపణలున్నాయి.  విషయం బయటకు రావడంతో  గాయత్రి ఆసుపత్రిపై సోమవారం తెల్లవారుజూమున SOT పోలీసులు దాడులు చేశారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఇద్దరికి అబార్షన్లు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు.  గాయత్రి ఆసుపత్రికి అబార్షన్లు చేసే అర్హత లేదని వైద్యాధికారులు తెలిపారు.  ఈ వ్యవహారంలో  కడుపులో ఆడపిల్ల కాబట్లే మహిళలకు అబార్షన్లు జరిగినట్లుగా తెలుస్తోంది. 

దీంతో ఆసుపత్రి నిర్వహకులతో పాటుగా డాక్టర్ శివతో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.  2022లోనూ ఆలేరులోని ఓ బాలికకు అబార్షన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా  పట్టుబడ్డాడు  డాక్టర్ శివకుమార్.  విషయం బయటకు రావడంతో అప్పట్లో స్వాతి ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. 

అయితే ఇప్పుడు అదే స్వాతి ఆసుపత్రినే గాయత్రిగా మార్చి మళ్లీ ఇదే తరహా దుకాణం మొదలుపెట్టాడు. ఒక్కో అబార్షన్ కు రూ. 50 వేలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గాయత్రి ఆసుపత్రి మొదలుపెట్టాక డాక్టర్ శివకుమార్ ఎన్ని అబార్షన్లు చేశాడో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. డాక్టర్ శివ కుమార్ ను  భువనగరి పోలీసులకు అప్పగించారు SOT పోలీసులు.  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

Also read

Related posts

Share this