SGSTV NEWS
swapna shastra

Swapna Shastra: మీ ప్రియుడు లేదా ప్రియురాలు గురించి కలలు కంటున్నారా? ఎలా కనిపిస్తే ఎలాంటి ఫలితమో తెలుసా..



స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి నిద్ర పోతున్న సమయంలో కలలను చూడటం ద్వారా అనేక రకాల సంకేతాలను పొందుతాడు. కొన్ని కలలు శుభప్రదమైనవి. కొన్ని కలలు అశుభకరమైనవిగా పరిగణించబడతాయి. అయితే ఎవరికైనా కలలో తన భాగస్వామి కనిపిస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం ఆ కల అనేక రకాల సంకేతాలను ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ భాగస్వామిని మీ కలలో కనిపిస్తే ఎలాంటి సంకేతాలను సూచిస్తుందో తెలుసుకుందాం..


ప్రతి వ్యక్తి నిద్రలో కలలను కనడం సర్వసాధారణం. రకరకాల కలలు కంటారు. ఆ కలలు అతని జీవితానికి సంబంధించినవని స్వప్న శాస్త్రం పేర్కొంది. సనాతన ధర్మంలో స్వప్న శాస్త్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ శాస్త్రం సహాయంతో మనం అన్ని కలల అర్థాన్ని తెలుసుకుంటాము. అయితే మీరు ఎప్పుడైనా ప్రియుడు లేదా ప్రియురాలిని కలలో చూశారా? స్వప్న శాస్త్రం ప్రకారం మీ ప్రియుడు లేదా ప్రియురాలు కలలో కనిపించడం వల్ల అనేక శు, అశుభ సంకేతాలను తెలియజేస్తుంది. అయితే కలల ఫలితం అనేది మీరు మీ ప్రియుడు లేదా ప్రియురాలు ని కలలో చూసిన స్థితిపై ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మీ ప్రియుడు లేదా ప్రియురాలు కలలో చూడటం వలన కలిగే ఫలితం ఏమిటో తెలుసుకుందాం..

మీ భాగస్వామి నవ్వుతూ కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం.. మీ కలలో మీ భాగస్వామి నవ్వుతూ కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ కలకు అర్ధం ఏంటంటే మీరు జీవితంలో మీ భాగస్వామి ప్రేమను పొందబోతున్నారని.. సంబంధం అందంగా సాగుతుందని అర్థం.

మోసం చేస్తున్నట్లు కల కంటే మీ భాగస్వామి మిమ్మల్ని కలలో మోసం చేస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం ఇటువంటి కలకు అర్ధం.. మీ ప్రేమ సంబంధం విడిపోయే అవకాశం ఉందని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు బంధం నిలుపుకునేందుకు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ ఎక్కువగా నమ్మకుండా ఉండాలి.

భాగస్వామితో వాదిస్తుంటే మీ భాగస్వామితో వాదిస్తున్నట్లు కల వస్తే.. ఈ స్వప్నం కూడా శుభసూచకంగా పరిగణించబడదు. ఈ కలకు అర్ధం మీ ప్రేమలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

భాగస్వామి ఏడుస్తున్నట్లు కనిపిస్తే మీ భాగస్వామి కలలో ఏడుస్తున్నట్లు కనిపించడం కూడా మంచిది కాదు. స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కల మీ భాగస్వామి కోపంగా ఉందని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి.

భాగస్వామి స్వీట్ తింటున్నట్లు కల కంటే మీ భాగస్వామి కలలో స్వీట్లు తినడం చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల మీ ప్రేమ బంధం అద్భుతంగా ఉంటుందని.. మీరు త్వరలో మీ భాగస్వామితో కలవాలని ప్లాన్ చేయవచ్చని సూచిస్తుంది. ఇది మీ సంబంధం మరింత బలపడుతుందని కూడా సూచిస్తుంది.

సంబంధం మరింత బలంగా ఉండవచ్చు అంతేకాకుండా ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉన్న భాగస్వామిని కలలో కనిపిస్తే ఆ కల శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు చూడటం మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాదు ప్రియుడు లేదా ప్రియురాలు మీ జీవిత భాగస్వామి కావచ్చు

Also read

Related posts

Share this