SGSTV NEWS
CrimeTelangana

Korutla: 5 ఏళ్ల చిన్నారి దారుణ హత్య – పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శనగర్‌లో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. చిన్నారి కనిపించకుండా పోయిన ఘటనలో, దారుణం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. పోలీసులు విచారణ చేపట్టగా, ఈ హత్యపై పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.


కోరుట్ల పట్టణం ఆదర్శనగర్‌లో జరిగిన 5 ఏళ్ల చిన్నారి హత్య కేసులో దారుణం వెలుగుచూసింది. సమీప బంధువులే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. శనివారం సాయంత్రం సమయంలో హితీక్ష అనే ఐదేళ్ల చిన్నారి అదృశ్యమవగా..పాప తల్లీ నవీన పోలీస్ ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటిపక్కనే బాత్రూమ్‌లో విగతజీవిగా పాప మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు..పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ విభేదాలతో పాప సొంత పిన్ని మమతనే హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం. ఈ కేసు గురించి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. హితీక్ష కుటుంబసభ్యుల్లో కొందరిని ప్రశ్నించిన పోలీసులు.. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లుగా అనుమానిస్తున్నారు. సిసీ టీవీ, సెల్‌ఫోన్‌ లోకేషన్‌ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

శనివారం సాయంత్రం 5 గంటలకు స్కూల్‌ నుంచి వచ్చిన చిన్నారి చుట్టుపక్కల పిల్లలతో కలిసి బయటకు వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది. సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇళ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్‌రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్‌రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు

Also read

Related posts

Share this