SGSTV NEWS
Andhra PradeshCrime

ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య!.. చెట్టుకు వేలాడుతూ


ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లెలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ తెల్లవారుజామున చెట్టుకు వేలాడుతూ వారి మృతదేహాలు కనిపించాయి.

Crime News: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ సమీపంలో  ఘోర విషాదం చోటు చేసుకుంది. కలిసి జీవించలేమనుకున్న ప్రేమ జంట చావుతో ఒకటయ్యారు.  ప్రేమ వివాహానికి ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు

పెళ్ళికి అంగీకరించలేదని..
వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన భారతి, రాముడు కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే భారతికి ఇప్పటికే వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయినప్పటికీ రాముడి పై ఉన్న ప్రేమతో భర్తకు దూరంగా ఉంటోంది. ఎంతకీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో  ప్రకాశం జిల్లా అక్కేపల్లి గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రాముడు, భారతి వరసుకు అన్నా చెల్లెల్లు అవుతారని.. అందుకే పెళ్ళికి అంగీకరించలేదని కుటుంబీకులు చెబుతున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్త్తు చేపట్టారు

Also read

Related posts

Share this