SGSTV NEWS
CrimeTelangana

ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

హనుమకొండ జిల్లా పెద్దకోడెపాకలో విషాదం


శాయంపేట,: ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని, కొద్ది మారుల తేడాతో జాబ్‌ పోతున్నదని మనస్తాపానికి గురైన ఓ యువతి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలో శుక్రవారం జరిగింది. ఎస్సై పరమేశ్‌ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన ప్రత్యూష(24) బీటెక్‌ పూర్తి చేసింది. రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్నది. పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం కొన్ని మారుల తేడాతో కోల్పోయింది. దీంతో మనోవేదన గురయ్యేది. శుక్రవారం భార్యతో కలిసి రమేశ్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రమేశ్‌ అత్త చెక లక్ష్మి మధ్యాహ్నం ఇంటికి వెళ్లి తలుపులు తీయగా ప్రత్యూష ఇంటి దూలానికి చున్నీతో ఉరేసుకొని ఉన్నది. రమేశ్‌ వచ్చి ప్రత్యూషను పరకాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు

Also read

Related posts

Share this