SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: 30 ఏళ్లుగా పుట్ట పక్కనే ఉంటున్న విగ్రహం – మొన్న పొద్దుపొడిచేసరికి.. అకస్మాత్తుగా

అన్నమయ్య జిల్లాలో గుప్త నిధుల కోసం వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముఠా కలకలం రేపింది. పెనగలూరు మండలంలో స్కూల్‌లో ఉన్న 30 ఏళ్ల పురాతన విగ్రహాన్ని దొంగిలించి చెరువులో విసిరేశారు. మొత్తం 13 మంది (మూడు మహిళలతో సహా) అరెస్ట్ అయ్యారు. విగ్రహాల ధ్వంసానికి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలో గుప్త నిధుల ముఠా కలకలం రేపింది. దేవాలయాలను, దేవుని విగ్రహాలను కూడా వదలకుండా ధనార్జన ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్న దుర్మార్గులు కటకటాల పాలయ్యారు. శనివారం గుప్త నిధుల ముఠాను పెనగలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ముగ్గురు మహిళలతో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుండి ఒక ఇన్నోవా, ట్రాక్టర్, 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మన్నూరు రూరల్ సీఐ బివి రమణ మీడియా సమావేశంలో వెల్లడించారు.

పెనగలూరు మండలం ఓబిలి సమీపంలోని హీరా స్కూల్‌లో ఉన్న 30 సంవత్సరాల పురాతన వినాయక విగ్రహంను ఎవరో దొంగిలించారు. స్కూల్ యాజమాన్యం పిర్యాదు మేరకు పోలీసు‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నందలూరు చుక్కయ పల్లెకు చెందిన రవి ముఠా ఈ విగ్రహాన్ని దొంగిలించినట్టు కనుగొన్నారు. విగ్రహాన్ని వీరు ఈటమార్పూరం చెరువులోకి తరలించి గుప్తనిధుల కోసం దేవుని విగ్రహాన్ని ధ్వంసం చేసి చూసారు. విగ్రహంలో నిధులు ఏమీ లేకపోవడంతో చెరువులోనే దేవుని విగ్రహం ముక్కలు పడవేసి దుండగులు పారిపోయారు. సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ జరిపిన పోలీసుల రవి ముఠాలోని ముగ్గురు మహిళలతో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. ఒక ఇన్నోవా, ట్రాక్టర్, 4 బైక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ బివి రమణ మాట్లాడుతూ.. గుప్త నిధుల తవ్వకాలు జరపడం, ఇలా దేవీదేవతలు విగ్రహాలు ధ్వసం చేయడం నేరమని తెలిపారు. పురాతన ఆలయాలను దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన 13 మంది నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also read

Related posts

Share this