ఆ మహిళకు వివాహమై భర్త మరణించాడు. ఆమెకు ఓ కుమార్తె ఉంది. ఆ తర్వాత సదరు వివాహితకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాయమాటలతో దగ్గరయ్యాడు. తమకు చేదోడుగా వాదోడుగా ఉంటాడనుకుందో ఏమో తెలియదు కానీ సదరు మహిళ ఆ మాటలు నమ్మి అతడితో సహజీవనం చేస్తోంది. ఇక్కడే అతను తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. కుమార్తెను తనకిచ్చి వివాహం చేయాలని వారిని వేధించసాగాడు. అంతటితో ఆగకుండా ఇరువురిపై దాడి చేసేవాడు. అతని వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత భర్త 2016లో మరణించారు. ఆమెకు పి. నాగిరెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సహజీవనం సాగించారు. ఆ మహిళ కుమార్తెను వివాహం చేసుకుంటానని ఆమెను అతను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డి మరో బాలికను వివాహం చేసుకోగా వారికి ఓ బిడ్డ జన్మించింది. ఆ తర్వాత భార్యాబిడ్డలను వదిలేసిన నాగిరెడ్డి గతంలో సహజీవనం చేసిన మహిళ వద్దకు మళ్లీ వచ్చాడు.
Anaparthi Threat Incident : ఈ నేపథ్యంలో కుమార్తెను ఇచ్చి పెళ్లి జరిపించాలంటూ నాగిరెడ్డి ఇరువురిని కొడుతూ వేధించసాగాడు. దీంతో బాధితురాలు అనపర్తి పోలీస్స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగిరెడ్డిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు వివరించారు. మరోవైపు స్టేషన్ వద్ద నాగిరెడ్డి తల్లి తన కుమార్తెపై దాడి చేసి తీవ్రంగా కొట్టిందని బాధిత మహిళ వాపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను ఆస్పత్రిలో చేర్పించింది.
కొన్ని నెలల క్రితం ఒంగోలులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన వివాహిత తన భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె పదో తరగతి చదువుతున్న కుమార్తెతో వేరుగా నివసిస్తోంది. టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు అనే వ్యక్తితో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో మైనర్ బాలికను రోజూ పాఠశాలకు తీసుకెళ్లి తీసుకొస్తుండేవాడు. తల్లితో సహ జీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న అతడు నైతికతను మరిచాడు. ప్రేమ పేరుతో రాజు ఆ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పాడు. అది నిజమేనని ఆ బాలిక నమ్మింది. అంతటితో ఆగకుండా ఆ యువతిని లోబరుచుకొని అపహరించాడు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు