నరసరావుపేట మహిళ హత్యకేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తన్నీరు అంకమ్మరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. సలీమా అనే మహిళను హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
నరసరావుపేట మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తన్నీరు అంకమ్మరావు (30)కి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ నేతి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. నరసరావుపేటలో 2023 మే 5న సలీమా అనే మహిళను అతడు దారుణంగా హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
కాగా ప్రస్తుతం నిందితుడు మరో రెండు హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. నరసరావుపేటలో నిందితుడు తన్నీరు అంకమ్మరావు మూడు హత్యలు చేసి జైల్లో ఉన్నాడు. జులాయిగా తిరుగుతూ మూడు హత్యలకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా నరసరావుపేట కోర్టు చరిత్రలో మొదటిసారి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.
నిందుతుడు సైకో.. అతడిపై కేసులు ఇవే
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మే, 2023లో ఒకేసారి జంట హత్యలు వెలుగు చూశాయి. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ద్వారా గుర్తించి పట్టుకున్నారు. అతడు రూ.150 కోసం దారుణంగా హత్యచేసినట్లు తెలిపారు. ముందుగా పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు రక్తపుమడుగులో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీలను చూసి మద్యం మత్తులో కింద పడి మృతి చెంది ఉంటారని భావించారు.
రెండు డెడ్ బాడీలపై ఒకేరకమైన గాయలు ఉండటంతో అనుమానస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఈ హత్యలు చేసింది నిందితుడు తన్నీరు అంకమ్మరావుగా గుర్తించి అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ రోడ్డులో నిద్రిస్తున్న ఒక వ్యక్తి వద్ద రూ.30 తీసుకుని అంకమ్మరావు అతడిని బండరాయితో బాది హత్య చేసాడు. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న మరో వ్యక్తి వద్ద రూ.120 తీసుకుని అదే రీతిలో బండ రాయితో చంపేశాడు. ఇక ఈ రెండు హత్యలతో 2023, మే 5న రూ.400 కోసం ఓ యాచకురాలి హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించగా అందులోనూ అంకమ్మరావే నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు.
Also read
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!
- చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్! విద్యార్థిని మృతి
- Andhra: పైకి బుద్దిమంతుడిలా ఉన్నాడనుకునేరు.. వెనుక కథ వేరే ఉంది.. అసలు మ్యాటర్ తెలిస్తే
- Andhra: పక్కా 420.. పోలీసులతో చిక్కడు దొరకడు గేమ్ ఆడాడు.. చివరికి ఇలా పాపం పండింది
- Andhra: రేయ్ ఏంట్రా ఇది.. ఇన్సూరెన్స్ సొమ్ము కోసం మాస్టర్ ప్లాన్.. చంపి ముక్కలు చేసి..