హైదరాబాద్‌లోని బాచుపల్లిలో దారుణం జరిగింది. నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఝార్ఖండ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి HYDకి వచ్చింది. అది తెలిసి ఇక్కడే ఉంటున్న ఆమె ఫ్రెండ్స్ రూంకు తీసుకెళ్లి తాగించి రేప్ చేశారు.
ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు చెలరేగిపోతున్నారు. మరికొందరు నమ్మించి నట్టెటా ముంచుతున్నారు. పక్కనే ఉండి మంచిగా మాట్లాడి.. ఆపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై ఇద్దరు యువకులు రేప్ చేశారు. హైదరాబాద్‌లోని బాచు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
యువతిని తాగించి రేప్
ఝార్ఖండ్కి చెందిన 20 ఏళ్ల యువతి తమ రాష్ట్రంలోనే బయో మెడికల్ లాస్ట్ ఇయర్ చదువుతోంది. అదే రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల అజయ్, 22 ఏళ్ల హరితో ఆమెకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఈ ఇద్దరు యువకులు బాచుపల్లిలోని హరితవనం కాలనీలో ఉంటున్నారు. ఆ యువతి హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్లో ‘ఇంటర్న్‌షిప్’ చేయడానికి ఝార్ఖండ్ నుంచి నగరానికి వచ్చింది
ఈ విషయం తెలుసుకున్న అజయ్, హరి పక్కా ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే ఆ యువతికి ఫోన్ చేసి తాము ఉంటున్న ప్రాంతానికి రావాలని వారు కోరారు. మెల్లగా ఆ యువతిని ఒప్పించారు. దీంతో మే 3వ తేదీన నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలోని వారు అద్దెకు ఉంటున్న రూమ్‌కు ఆ యువతిని తీసుకొచ్చారు. అనంతరం ఆ రూమ్‌లో ముగ్గురూ కలిసి మద్యం తాగారు.
తాగిన తర్వాత నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో అజయ్, హరి కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశారు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా బెంబోలెత్తిపోయింది. వెంటనే వారి నుంచి తప్పించుకుని రూమ్ బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసింది. అనంతరం సమీప స్థానికులు గమనించి అత్యాచారానికి పాల్పడిన యువకులను పట్టుకున్నారు. ఆపై వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది.
Also Read
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?




