జమ్మూ కాశ్మీర్ పోలీసుల రాష్ట్ర దర్యాప్తు సంస్థ దక్షిణ కాశ్మీర్‌లోని 20 ప్రదేశాలపై దాడులు చేసి స్లీపర్ సెల్ మాడ్యూల్‌ను ఛేదించింది. ఈ సమయంలో, పెద్ద మొత్తంలో అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై పోరు తీవ్రమైంది. ఇంతలో రాష్ట్ర దర్యాప్తు సంస్థ పోలీసులు ఒక పెద్ద విజయాన్ని సాధించారు. దక్షిణ కాశ్మీర్‌లో 20 చోట్ల దాడులు చేసి పోలీసులు స్లీపర్ సెల్ మాడ్యూల్‌ను ఛేదించారు. ఈ సమయంలో పెద్ద మొత్తంలో అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాశ్మీర్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సహచరులు, గ్రౌండ్ వర్కర్లపై (OGWs) జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిఘా ఉంచారని రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) ఒక ప్రకటనలో తెలిపింది. కాశ్మీర్‌లోని అనేక స్లీపర్ సెల్‌లు పాకిస్తాన్‌లో కూర్చున్న వారి మాస్టర్‌లతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయని అనుమానిస్తన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ మొదలైన మెసేజింగ్ యాప్‌ల ద్వారా భద్రతా దళాలకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యమైన ఇన్‌స్టాలేషన్‌ల గురించి సున్నితమైన, వ్యూహాత్మక సమాచారాన్ని అందించడంలో పాల్గొన్నాయని సాంకేతిక నిఘా వెల్లడించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కమాండర్ల ఆదేశాల మేరకు ఈ ఉగ్రవాద సహచరులు ఆన్‌లైన్ రాడికల్ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇది జాతీయ భద్రత, సమగ్రతకు ముప్పు కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో స్లీపర్‌సెల్స్ జాడలేకుండా చేసేందుకు భారత భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.
దక్షిణ కాశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో దాదాపు 20 చోట్ల దాడులు నిర్వహించినట్లు SIA తెలిపింది. ఈ దాడిలో, పెద్ద మొత్తంలో అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంస్థలు ఉగ్రవాద కుట్రలో చురుగ్గా పాల్గొంటున్నాయి. భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను సవాలు చేయడమే కాకుండా అసంతృప్తి, ప్రజా అశాంతి, మత విద్వేషాలను రెచ్చగొట్టే లక్ష్యంతో భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రచారం చేస్తున్నాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఉగ్రవాదుల ఈ పిరికిపంద చర్య యావత్ దేశాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేశారు. దీని తరువాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన వైఖరి తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ కింద, పాకిస్తాన్ తోపాటు POK పై దాడి చేసి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025