సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి , ధనుంజయరెడ్డి , బాలాజీ గోవిందప్పలను ఈ రోజు (ఆదివారం) విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ వారు ఈ రోజు విచారణకు హజరుకాకపోవడం చర్చనీయంశంగా మారింది.
AP Liquor Scam: సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కేసులో సిట్ తన దూకుడు పెంచుతోంది. కాగా వైసీపీ హయాంలో మద్యం టెండర్లలో గోల్‌మాల్ జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సిట్‌ఇటీవల కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య లను అరెస్ట్ చేసి రిమాండ్ విధించింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి , ధనుంజయరెడ్డి , బాలాజీ గోవిందప్పలను ఈ రోజు (ఆదివారం) విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ వారు ఈ రోజు విచారణకు హజరుకాలేదు, ఉదయం పదిగంటలకే విజయవాడ సిట్ కార్యాలయానికి రావలసి ఉన్న నిందితులు ఇప్పటివరకు రాకపోవడంతో వారు వస్తారా? రారా అనే సందిగ్ధం నెలకొంది.
కాగా మద్యం కేసులో బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నిందితులకు అక్కడ ఉపశమనం లభించలేదు. దీంతో వారు విచారణకు రావలసిన పరిస్థితి ఏర్పడింది. కాగా కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య ల రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు చేర్చారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకే అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వాళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో సిట్ అధికారులు పేర్కొన్నారు.కాగాఈ కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలు ఉన్నారు.
కాగా ఈ కేసులో తమ పేర్లు బయటకు రావడంతోనే ఈ ముగ్గురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీం సూచించింది. ముందుగా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో వెంటనే వారు సుప్రీంలో పిటిషన్ వేశారు. మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. గతంలో వేసిన పిటిషన్‌ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్‌ను వేయాలని సుప్రీం కోర్టు తెలియజేస్తూ విచారణను వాయిదా వేసింది. దీంతో ఈరోజు విచారణకు రావాలని నిందితులకు అధికారులు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. కానీ ఇంతవరకు వారు రాకపోవడంతో వారికి తిరిగి నోటీసులు ఇస్తారా లేక ఏకంగా అరెస్ట్ చేస్తారా అనే విషయం చర్చనీయంశంగా మారింది.
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





